High Court
హైదరాబాద్, విధాత: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ నాగం జనార్దన్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను సోమవారం తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ నుంచి నాగం బరిలో నిలువగా బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నుంచి మర్రి జనార్దన్‌రెడ్డి విజయం సాధించించారు.
అయితే మర్రి తన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు నివేదిక సమర్పించారని, కొన్ని వివరాలను దాచిపెట్టి ఎన్నికల్లో విజయం సాధించారని, అతని ఎన్నిక చెల్లదంటూ 2019లో నాగం జనార్దన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.
మర్రి జనార్దన్‌రెడ్డి ఎన్నిక రద్దు చేయాలంటూ పిటిషనర్ వేసిన పిటిషన్‌లో సరైన ఆధారాలు కనబడటంలేదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో మర్రి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తీర్పు వెల్లడించింది.