Burning sun: దంచికొడుతున్న ఎండ‌లు.. 122 ఏండ్ల త‌ర్వాత మండిన ఫిబ్ర‌వ‌రి

విధాత‌: దేశ వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్నాయి. సాధార‌ణం కంటే అత్యంత అధికంగా ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. అయితే 122 ఏండ్ల త‌ర్వాత ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో అత్య‌ధిక స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన‌ట్టు భార‌త వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. 1901 నుంచి ఫిబ్ర‌వ‌రి నెల‌లో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి అని ఐఎండీ వెల్ల‌డించింది. ఈ ఏడాది మార్చి నెల‌లో దేశ వ్యాప్తంగా ప‌లు చోట్ల […]

Burning sun: దంచికొడుతున్న ఎండ‌లు.. 122 ఏండ్ల త‌ర్వాత మండిన ఫిబ్ర‌వ‌రి

విధాత‌: దేశ వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్నాయి. సాధార‌ణం కంటే అత్యంత అధికంగా ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. అయితే 122 ఏండ్ల త‌ర్వాత ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో అత్య‌ధిక స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన‌ట్టు భార‌త వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది.

1901 నుంచి ఫిబ్ర‌వ‌రి నెల‌లో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి అని ఐఎండీ వెల్ల‌డించింది. ఈ ఏడాది మార్చి నెల‌లో దేశ వ్యాప్తంగా ప‌లు చోట్ల వ‌ర్షాలు కురిసిన సంగ‌తి తెలిసిందే. దీంతో చాలా చోట్ల సాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌లే న‌మోదు అయ్యాయి. గ‌తేడాది మార్చి నెల‌లో మాత్రం అత్య‌ధిక స్థాయిలో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన‌ట్లు ఐఎండీ తెలిపింది. గ‌తేడాది ఏప్రిల్ నెల‌లో కూడా ఎండ‌లు దంచికొట్టిన‌ట్లు పేర్కొంది.

ప‌శ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, బీహార్ రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం వేడి ఉష్ణోగ్ర‌త‌లు ఉన్న‌ట్లు తెలిపింది. ఈ రాష్ట్రాల్లో వేడిగాలులు కొన‌సాగే ప‌రిస్థితులు ఉన్న‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది. రానున్న నాలుగు రోజుల్లో సాధార‌ణం కంటే అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది. సెంట్ర‌ల్‌, ఈస్ట్‌, నార్త్‌వెస్ట్ ప్ర‌దేశాల్లో ఈ ఏడాది నార్మ‌ల్ స్థాయి క‌న్నా అధికంగా హీట్‌వేవ్ ఉండే అవ‌కాశం ఉంది.