Holi Festival | హోలీ పండుగ‌.. విశిష్ట‌త ఏంటో తెలుసా..?

Holi Festival | హోలీ పండుగ కోసం దేశ‌మంతా ఎదురు చూస్తోంది. దీపావ‌ళి త‌ర్వాత అత్యంత వేడుక‌గా జ‌రుపుకునే పండుగ ఏదైనా ఉందా? అంటే అది హోలీ అని చెప్పొచ్చు. మ‌రి అలాంటి హోలీ పండుగ వ‌స్తుందంటే చాలు పిల్ల‌లు, యువ‌కులు ఎంతో హుషారుగా ఉర‌క‌లేస్తుంటారు. ఈ పండుగ‌కు చాలా విశిష్ట‌త‌లు ఉన్నాయి. హోలీకి పురాణగాథ‌ల‌తో పాటు శాస్త్రీయ‌మైన కార‌ణాలు కూడా ఉన్నాయి. ప్ర‌తి ఏడాది ఫాల్గుణ మాసంలో పౌర్ణ‌మి రోజున నిర్వ‌హించుకునే ఈ పండుగ‌ను హోలీ, కాముని […]

  • Publish Date - March 6, 2023 / 06:05 AM IST

Holi Festival | హోలీ పండుగ కోసం దేశ‌మంతా ఎదురు చూస్తోంది. దీపావ‌ళి త‌ర్వాత అత్యంత వేడుక‌గా జ‌రుపుకునే పండుగ ఏదైనా ఉందా? అంటే అది హోలీ అని చెప్పొచ్చు. మ‌రి అలాంటి హోలీ పండుగ వ‌స్తుందంటే చాలు పిల్ల‌లు, యువ‌కులు ఎంతో హుషారుగా ఉర‌క‌లేస్తుంటారు. ఈ పండుగ‌కు చాలా విశిష్ట‌త‌లు ఉన్నాయి. హోలీకి పురాణగాథ‌ల‌తో పాటు శాస్త్రీయ‌మైన కార‌ణాలు కూడా ఉన్నాయి. ప్ర‌తి ఏడాది ఫాల్గుణ మాసంలో పౌర్ణ‌మి రోజున నిర్వ‌హించుకునే ఈ పండుగ‌ను హోలీ, కాముని పున్న‌మి, డోలికోత్స‌వం అని కూడా పిలుస్తారు.

హోలీ పండుగ నేప‌థ్యం ఇదీ..

రాక్ష‌స రాజు హిర‌ణ్య‌క‌శ‌పుడి కుమారుడు ప్ర‌హ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మ‌రిస్తుంటాడు. విష్ణుమూర్తిని స్మ‌రించ‌డం హిర‌ణ్య‌క‌శ‌పుడికి ఏ మాత్రం న‌చ్చ‌దు. దీంతో ప్ర‌హ్లాదుడిని చంపేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఈ క్ర‌మంలో అత‌ని రాక్ష‌స సోద‌రి హోళిక‌ను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శ‌క్తితో ప్ర‌హ్లాదుడిని అగ్నిలో ఆహుతి చేయాల‌ని హోళిక‌ను హిర‌ణ్య‌క‌శ‌పుడు కోరుతాడు. దీంతో ప్ర‌హ్లాదుడిని త‌న ఒడిలో కూర్చోబెట్టుకుని హోళిక మంట‌ల్లో దూకుతుంది. అయితే విష్ణుమూర్తి త‌న ఆధ్యాత్మిక శ‌క్తితో ప్ర‌హ్లాదుడిని ప్రాణాల‌తో కాపాడుతాడు. హోళిక మాత్రం మంట‌ల్లో కాలిపోతుంది. ఈ క్ర‌మంలో హోళికా ద‌హ‌న‌మైన రోజునే హోలీ అని పిలుస్తార‌నే ప్ర‌చారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోలిక ద‌హ‌నం నిర్వ‌హిస్తారు.

శాస్త్రీయ కార‌ణాలు ఇవి..

హోలీ పండుగకు శాస్త్రీయ కార‌ణాలు కూడా ఉన్నాయి. వ‌సంత కాలంలో వాతావ‌ర‌ణం చ‌లి కాలం నుంచి ఎండాకాలానికి మారుతుంది. వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల వైర‌ల్ జ్వ‌రం, జ‌లుబు వంటి వ్యాధులు సంభ‌విస్తాయి. ఈ జ్వ‌రాల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి కొన్ని ఔష‌ధ మొక్క‌ల నుంచి త‌యారు చేసిన స‌హ‌జ‌మైన రంగులు క‌లిపిన నీటిని చ‌ల్లుకోవ‌డం ద్వారా దూర‌మ‌వుతాయ‌నినే వాద‌న ఉంది. త‌డి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మ‌రిగించి అవి ప‌సుపు రంగులోకి మారేంత వ‌ర‌కు ఉంచుతారు. అది ఔష‌ధ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక స‌హ‌జ‌మైన రంగు పొడుల‌ను చ‌ల్లుకోవ‌డం ద్వారా ఔష‌ధంగా ప‌ని చేస్తాయ‌ని మ‌న పూర్వీకుల న‌మ్మ‌కం. కాబ‌ట్టి హోలీ పండుగ రోజున మోదుగ పూల‌తో కూడిన రంగుల‌ను ఉప‌యోగిస్తుంటారు.

Latest News