30.04.2024 మంగ‌ళ‌వారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించి ఖ‌ర్చులు..!

చాలా మంది జ్యోతిష్యాన్ని న‌మ్ముతుంటారు. ఏ ప‌ని ప్రారంభించినా స‌రే త‌మ రాశుల ఫ‌లితాల‌ను బ‌ట్టి ప‌నుల‌ను, శుభ‌కార్యాల‌ను ప్రారంభిస్తారు మ‌రి ఈ రోజు రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

30.04.2024 మంగ‌ళ‌వారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించి ఖ‌ర్చులు..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. పని ప్రదేశంలో ప్రతికూలతలు ఎదురవుతాయి కాబట్టి సహనంతో ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వివాదాలు రావు.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతారు. ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి కొత్త పనులను వాయిదా వేస్తే మంచిది.

మిథునం

మిధునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తీరిక లేని పనుల నుంచి కొంత విరామం తీసుకొని హాయిగా గడపండి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రుజయం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఓ శుభవార్త మీ ఇంటి వాతావరణాన్ని ఆనందభరితం చేస్తుంది.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది. ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో అందరి సహకారం ఉంటుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఇంటా బయట ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురవుతాయి. కొంచెం సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. ధన నష్టం సూచితం. ఖర్చులు పెరుగుతాయి.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో అనుకొని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఓర్పుతో ఉంటే పరిస్థితులు చక్కబడతాయి. ఇంట్లో గొడవలకు, వాదనలకు దూరంగా ఉండండి. మీ సహనంతోనే అన్ని సమస్యలకి పరిస్కారం దొరుకుతుంది. ఖర్చులకు సరిపడా ఆదాయం ఉంటుంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కొన్ని సమస్యలు ఉన్నా మీ చాకచక్యంతో అన్నింటిని పరిష్కరిస్తారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రోజంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని సమస్యలు ఉన్నా సునాయాసంగా తొలగిపోతాయి. ముఖ్యమైన పనుల్లో నిర్లక్ష్యం పనికిరాదు. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ధన నష్టం కలిగే అవకాశం ఉంది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం ఉద్రిక్తంగా, గందరగోళంగా ఉంటుంది. కుటుంబసభ్యుల మధ్య కోపతాపాలు, ఆవేశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఇంట్లోనే మీకు శత్రువులు తయారవుతారు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ పని ఉన్నతాధికారులకు సంతోషం కలిగిస్తుంది. ప్రమోషన్, జీతం పెరుగుదలకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. లాభాలు, ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.