ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేయాలి..? దీని వెనుకున్న ఆంత‌ర్యం ఏంటి..?

ఇంటికి అందం తీసుకొచ్చేలా ప్ర‌తి రోజు ఏదో ఒక కొత్త ముగ్గు వేస్తుంటారు. చూసేవారికి కూడా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. నిత్యం ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేయాలి..? దీని వెనుకున్న ఆంత‌ర్యం ఏంటి..? ముగ్గుల‌కు ఎందుకంత ప్ర‌త్యేకం అనే విష‌యాల‌ను తెలుసుకుందాం..

ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేయాలి..? దీని వెనుకున్న ఆంత‌ర్యం ఏంటి..?

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు చాలా మంది త‌మ ఇండ్ల పొద్దున్నే క‌లాపి చ‌ల్లి.. ముగ్గులు వేస్తుంటారు. కొంద‌రు గీత‌ల రూపంలో, ఇంకొంద‌రు చుక్క‌ల‌తో ముగ్గులు వేస్తారు. మొత్తానికి ఆ ఇంటికి అందం తీసుకొచ్చేలా ప్ర‌తి రోజు ఏదో ఒక కొత్త ముగ్గు వేస్తుంటారు. చూసేవారికి కూడా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. నిత్యం ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేయాలి..? దీని వెనుకున్న ఆంత‌ర్యం ఏంటి..? ముగ్గుల‌కు ఎందుకంత ప్ర‌త్యేకం అనే విష‌యాల‌ను తెలుసుకుందాం..

  • ఇంటి ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్టశక్తులను రాకుండా అడ్డుకోవడమే కాదు ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.
  • ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని అర్థం. అందుకే పండుగల సమయంలో ఇలా వేయాల‌ని పెద్ద‌లు సూచిస్తుంటారు.
  • దేవుడి పూజ చేసే సమయంలో పీటపై మధ్యలో చిన్న ముగ్గువేసి నాలుగు వైపులా రెండేసి గీతలు తప్పనిసరిగా గీయాలి.
  • నక్షత్రం ఆకారంలో వేసే ముగ్గు నెగెటివ్ వైబ్రేషన్స్ ని దరిదాపులకు రాకుండా చేస్తుంది.
  • ఇంటి ముందు వేసే పద్మం ముగ్గువెనుక యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలు ఉంటాయని తద్వారా చెడుశక్తిని ఆపుతుందని చెబుతారు.
  • దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.
  • ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు తప్పనిసరిగా వేస్తే దైవ శక్తులను ఇంట్లోకి ఆహ్వానించేందుకే.
  • ఇంటి తలుపులు తెరిచి ఉన్నా ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందనే ఉద్దేశంతో ఆ రోజు ఆ ఇంటి నుంచి బిక్ష స్వీకరించేవారు కాదట. అందుకే ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గు ఉండదు. శ్రాద్ధకర్మలు చేసిన వెంటనే ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన తర్వాత ముగ్గువేస్తారు. అందుకే ఇల్లంతా కడిగిన తర్వాత ముగ్గువేయకుండా వదిలేస్తే అది అశుభానికి సూచన అంటారు పండితులు.