Viral Video | బియ్యం నాణ్యతను తనిఖీ చేయడం ఎలా..? యువతి తెలివికి నెటిజన్లు ఫిదా..!
Viral Video | అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక మెతుకు పట్టుకుని చూస్తే తెలుస్తుంది.. అని మన పెద్దలు చాలా సందర్భాల్లో సామెత ఉపయోగిస్తుంటారు. అయితే బియ్యం బస్తాలో ఉన్న బియ్యం నాణ్యతతో కూడినవా..? లేదా..? అని తెలుసుకునేందుకు ఆ సంచిని మొత్తం పరిశీలించాల్సిన అవసరం లేదంటుంది ఈ యువతి. చాలా తెలివిగా బియ్యం నాణ్యతను ఆ యువతి పరిశీలిస్తోంది. ఆ అమ్మాయి తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ గోదాం నిండా బియ్యం […]

Viral Video |
అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక మెతుకు పట్టుకుని చూస్తే తెలుస్తుంది.. అని మన పెద్దలు చాలా సందర్భాల్లో సామెత ఉపయోగిస్తుంటారు. అయితే బియ్యం బస్తాలో ఉన్న బియ్యం నాణ్యతతో కూడినవా..? లేదా..? అని తెలుసుకునేందుకు ఆ సంచిని మొత్తం పరిశీలించాల్సిన అవసరం లేదంటుంది ఈ యువతి. చాలా తెలివిగా బియ్యం నాణ్యతను ఆ యువతి పరిశీలిస్తోంది. ఆ అమ్మాయి తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఓ గోదాం నిండా బియ్యం బస్తాలు ఉన్నాయి. అయితే వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని ఆ గోదాంలో జోడిస్తున్నారు. అయితే ఆ బియ్యం బస్తాల్లో ఉన్న బియ్యం నాణ్యమైనవా..? లేదా..? అని తెలుసుకునేందుకు అక్కడ ఓ యువతిని ఉంచారు.
View this post on Instagram
అయితే బియ్యం బస్తా హమాలీల భుజం మీద ఉండగానే క్షణాల్లో ఓ పరికరంతో సంచికి పొడవగానే కొంచెం బియ్యం ఆమె చేతుల్లోకి వచ్చి పడుతున్నాయి. ఒక వేళ బియ్యం మంచిగా లేవనిపిస్తే.. ఆ బస్తాను వెనక్కి తీసుకురావాలని ఆదేశిస్తుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఇన్‌స్టాలో పది రోజుల క్రితం పోస్టు చేయగా, 25 మిలియన్ల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు ఆమె తెలివిని ప్రశంసిస్తున్నారు.