హైదరాబాద్ ఫార్ములా-ఈ రేస్.. తరలివచ్చిన సచిన్, రామ్‌చరణ్, KTR
విధాత: నగరంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ రేస్‌ను వీక్షించేందుకు క్రీడా, సినిమా, రాజకీయ ప్రముఖులు తరలి వస్తున్నారు. భారత్‌లో తొలిసారిగా ఫార్ములా- ఈ రేసింగ్ జరుగుతున్నది. రేసులో మొత్తం 11 జట్లు పోటీపడుతుండగా.. 22 మంది డ్రైవర్లు పాల్గొంటారు. ఫార్ములా ఈ రేస్ వీక్షించడానికి హైదరాబాద్ కి వచ్చిన సచిన్ టెండూల్కర్.#HyderabadEPrix #SachinTendulkar #Telangana pic.twitter.com/ja2x7Oe9jt — Manasa.B (@Siri4BRS) February 11, 2023 దేశం నుంచి మహీంద్రా, టాటా, టీసీఎస్ సంస్థలు సైతం బరిలో నిలుస్తున్నాయి. […]

విధాత: నగరంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ రేస్‌ను వీక్షించేందుకు క్రీడా, సినిమా, రాజకీయ ప్రముఖులు తరలి వస్తున్నారు. భారత్‌లో తొలిసారిగా ఫార్ములా- ఈ రేసింగ్ జరుగుతున్నది. రేసులో మొత్తం 11 జట్లు పోటీపడుతుండగా.. 22 మంది డ్రైవర్లు పాల్గొంటారు.
ఫార్ములా ఈ రేస్ వీక్షించడానికి హైదరాబాద్ కి వచ్చిన సచిన్ టెండూల్కర్.#HyderabadEPrix #SachinTendulkar #Telangana
pic.twitter.com/ja2x7Oe9jt— Manasa.B (@Siri4BRS) February 11, 2023
దేశం నుంచి మహీంద్రా, టాటా, టీసీఎస్ సంస్థలు సైతం బరిలో నిలుస్తున్నాయి. మరో వైపు ఈ రేసింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ మార్గ్‌లో సుమారు 2.8 కిలోమీటర్ల పొడవైన సర్క్యూట్‌ను సిద్ధం చేసింది.
#Actor @iamnagarjuna and his son @chay_akkineni at #HyderabadEPrix..#Actor pic.twitter.com/mP9NFSM1ha
— SHRA.1 JOURNALIST✍ (@shravanreporter) February 11, 2023
అలాగే 20వేల మంది ప్రేక్షకులు కూర్చోని వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్న ఫార్మలా- ఈ రేస్ ప్రాక్టీస్ జరగ్గా.. ఇవాళ ఉదయం క్వాలిఫయింగ్ రేస్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు రేసు ప్రారంభం కాగా.. దాదాపు గంటన్నర కొనసాగనున్నది.
Let’s Race #Hyderabad