Hyderabad Metro Fares: రేపటి నుంచి హైదరాబాద్ మెట్రో ఛార్జీల తగ్గింపు

Hyderabad Metro Fares: హైదరాబాద్ మెట్రో సంస్థ ఇటీవల పెంచిన ఛార్జీలలో 10శాతం తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని శనివారం నుంచి అమలు చేయనున్నారు. సవరించిన మెట్రో ఛార్జీల కనీస ధర రూ.11, గరిష్ఠ ధర రూ.69గా ఉంది. 2కిలో మీటర్ల వరకు మెట్రో ఛార్జీని రూ.12 నుంచి రూ.11కు తగ్గించారు. 2 నుంచి 3కిలో మీటర్ల వరకు మెట్రో ఛార్జీ రూ.18 నుంచి రూ.17కు తగ్గించారు. 4 నుంచి 6 కిలో మీటర్ల మెట్రో ఛార్జీని రూ.30 నుంచి రూ.28కి తగ్గించారు. 6 నుంచి 9 కిలోమీటర్ల వరకు మెట్రో ఛార్జీ రూ.40 నుంచి రూ.37కి తగ్గించారు. 9 నుంచి 12 కిలోమీటర్ల వరకు మెట్రో ఛార్జీ రూ.50 నుంచి రూ.47కి తగ్గించారు.
12 నుంచి 15 కిలోమీటర్ల వరకు మెట్రో ఛార్జీ రూ.55 నుంచి రూ.51కి తగ్గించారు. 15 నుంచి 18 కి.మీ వరకు రూ.60 నుంచి రూ.56కి, 18 నుంచి 21 కి.మీ వరకు రూ.66 నుంచి రూ.61కి తగ్గించారు. 21 నుంచి 24 కి.మీ వరకు రూ.70 నుంచి రూ.65కి తగ్గించారు. 24 కిలోమీటర్లకు పైగా రూ.75 నుంచి రూ.69కి తగ్గించారు. తగ్గించిన ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని మెట్రో సంస్థ తెలిపింది.