Hyderabad Rains | నగరాన్ని ముంచెతుతున్న వర్షాలు
Hyderabad Rains విధాత: హైదరాబాద్‌లో వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. గత రెండు రోజుల నుంచి నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్ట ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, కోఠీ, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్, మారేడుపల్లి, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సీతాఫల్‌మండి, కుత్బుల్లాపూర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, […]

Hyderabad Rains
విధాత: హైదరాబాద్‌లో వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. గత రెండు రోజుల నుంచి నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్ట ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, కోఠీ, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్, మారేడుపల్లి, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సీతాఫల్‌మండి, కుత్బుల్లాపూర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్టణం, చాంద్రాయణగుట్ట, సాగర్ రింగ్‌రోడ్డు, బీఎన్‌రెడ్డిలో భారీ వర్షం కురుస్తోంది.
వర్షాల ధాటికి నాగోల్‌లోని అయ్యప్ప కాలనీలో ఇండ్లలోకి వరద నీరుచేరింది. లింగంపల్లి రైల్వే అండర్‌పాస్ వద్ద భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి-లింగంపల్లి మార్గాల్లో వెళ్లాల్సిన వాహనాలను ట్రాఫిక్‌పోలీసులు దారిమళ్లిస్తున్నారు. అయితే భారీ వర్షాలతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. డీఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ అధికారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ నడిబొడ్డు అయిన నాగార్జున సర్కిల్లో రోడ్డు కుంగి పోయింది. అలాగే హుస్సేన్ సాగర్ వరదను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ట్యాంక్ బండ్, ముసారంబాగ్ బ్రిడ్జి దెగ్గర మూసీ వరదను కూడా కేటీఆర్ పరిశీలించి వరద వివరాలను తెలుసుకున్నారు. వరద బాధితులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.