ఇడ్లీల కోసం రూ.6 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసిన హైద‌రాబాదీ.. ఆన్‌లైన్‌లో 8,428 ప్లేట్ల ఇడ్లీలు ఆర్డ‌ర్

విధాత: ఇవాళ ప్ర‌పంచం ఇడ్లీ దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డ‌రింగ్ సంస్థ స్విగ్గీ ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించింది. గ‌త 12 నెల‌ల కాలంలో ఓ హైద‌రాబాదీ ఇడ్లీల కోస‌మే రూ. 6 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలిపింది. మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే. హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఆన్‌లైన్‌లో 8,428 ప్లేట్ల ఇడ్లీల‌ను ఆర్డ‌ర్ చేసిన‌ట్లు స్విగ్గీ ప్ర‌క‌టించింది. ఆయ‌న‌కు బిగ్గెస్ట్ ఇడ్లీ ల‌వ‌ర్‌గా నామ‌క‌ర‌ణం చేసింది స్విగ్గీ. 2022, మార్చి 30 […]

  • By: krs    latest    Apr 01, 2023 12:10 AM IST
ఇడ్లీల కోసం రూ.6 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసిన హైద‌రాబాదీ.. ఆన్‌లైన్‌లో 8,428 ప్లేట్ల ఇడ్లీలు ఆర్డ‌ర్

విధాత: ఇవాళ ప్ర‌పంచం ఇడ్లీ దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డ‌రింగ్ సంస్థ స్విగ్గీ ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించింది. గ‌త 12 నెల‌ల కాలంలో ఓ హైద‌రాబాదీ ఇడ్లీల కోస‌మే రూ. 6 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలిపింది.

మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే. హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఆన్‌లైన్‌లో 8,428 ప్లేట్ల ఇడ్లీల‌ను ఆర్డ‌ర్ చేసిన‌ట్లు స్విగ్గీ ప్ర‌క‌టించింది. ఆయ‌న‌కు బిగ్గెస్ట్ ఇడ్లీ ల‌వ‌ర్‌గా నామ‌క‌ర‌ణం చేసింది స్విగ్గీ. 2022, మార్చి 30 నుంచి 2023, మార్చి 25వ తేదీ వ‌ర‌కు స‌ద‌రు వ్య‌క్తి ఇడ్లీల‌ను ఆర్డ‌ర్ చేసిన‌ట్లు తెలిపింది.

ఈ ఇడ్లీ ప్రేమికుడు హైద‌రాబాద్‌లోనే కాదు.. బెంగ‌ళూరు, చెన్నై వంటి న‌గ‌రాల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా స్నేహితులు, కుటుంబ స‌భ్యుల కోసం ఇడ్లీలు ఆర్డ‌ర్ చేస్తున్న‌ట్లు స్విగ్గీ పేర్కొంది. అలా 12 నెల‌ల్లో ప్ర‌తి రోజు స‌గ‌టున 23 ప్లేట్ల ఇడ్లీల‌ను ఆర‌గించిన‌ట్లు వెల్ల‌డైంది.

అయితే ఇడ్లీ సౌత్ ఇండియాలో ఫేమ‌స్. బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్ సిటీల్లో ఇడ్లీని ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేస్తున్న‌ట్లు స్విగ్గీ వెల్ల‌డించింది. ముంబై, కోయంబ‌త్తూరు, పుణె, వైజాగ్, ఢిల్లీ, కోల్‌క‌తా, కొచ్చి సిటీల్లో కూడా ఇడ్లీని ఇష్ట‌ప‌డుతున్న‌ట్లు తెలిపింది.