Hyderabad | ప్రియుడితో వెళ్లిపోయిందని ఇంటి నుంచి వెలేశారు.. ఇంట‌ర్‌లో 945 మార్కులు సాధించింది..

Hyderabad | తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో ఓ అమ్మాయి ఆక‌ర్ష‌ణ‌కు లోనైంది. ఇంకేముంది త‌న బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లిపోయింది. ఇద్ద‌రు కూడా మైన‌ర్లు కావ‌డంతో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వ‌హించారు. అబ్బాయిని వారి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. త‌మ పరువు తీసిన కూతురు త‌మ‌కొద్దంటూ త‌ల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి వెలేశారు. దీంతో పోలీసులు ఆ బాలిక‌ను చిల్డ్ర‌న్ హోమ్‌కు త‌ర‌లించారు. ఆ అమ్మాయి ఎలాంటి కుంగుబాటుకు లోను కాలేదు. త‌నేందో నిరూపించుకునేందుకు ప‌ట్టుద‌ల‌తో చ‌దివింది. ఇటీవ‌ల విడుద‌లై […]

Hyderabad | ప్రియుడితో వెళ్లిపోయిందని ఇంటి నుంచి వెలేశారు.. ఇంట‌ర్‌లో 945 మార్కులు సాధించింది..

Hyderabad | తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో ఓ అమ్మాయి ఆక‌ర్ష‌ణ‌కు లోనైంది. ఇంకేముంది త‌న బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లిపోయింది. ఇద్ద‌రు కూడా మైన‌ర్లు కావ‌డంతో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వ‌హించారు. అబ్బాయిని వారి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. త‌మ పరువు తీసిన కూతురు త‌మ‌కొద్దంటూ త‌ల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి వెలేశారు. దీంతో పోలీసులు ఆ బాలిక‌ను చిల్డ్ర‌న్ హోమ్‌కు త‌ర‌లించారు.

ఆ అమ్మాయి ఎలాంటి కుంగుబాటుకు లోను కాలేదు. త‌నేందో నిరూపించుకునేందుకు ప‌ట్టుద‌ల‌తో చ‌దివింది. ఇటీవ‌ల విడుద‌లై ఇంట‌ర్ ఫ‌లితాల్లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా స్కోర్ చేసింది. దీంతో ఇంటి నుంచి వెలేసిన త‌ల్లిదండ్రులే ఇప్పుడు ఆమెను ఇంటికి ఆహ్వానిస్తున్నారు. అవ‌మానాలు ప‌డిన చోటే ఆమెకు స‌త్కారాలు అందుతున్నాయి.

హైద‌రాబాద్‌కు చెందిన ఓ అమ్మాయి 15 ఏండ్ల వ‌య‌సులోనే ప్రేమ‌లో ప‌డిపోయింది. దాంతో అత‌ని బాయ్‌ఫ్రెండ్‌తో వెళ్లిపోయింది. ఆ స‌మ‌యంలోనే ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసింది. టెన్త్ ఫ‌లితాల్లో 10కి 10 పాయింట్లు సాధించింది. అయితే త‌మ కూతురు వేరే యువ‌కుడితో వెళ్లిపోయింద‌న్న విష‌యం త‌ల్లిదండ్రుల‌కు తీవ్ర ఆందోళ‌న క‌లిగించింది. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఆ ఇద్ద‌రు మైన‌ర్ల ఆచూకీ క‌నుగొని, ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో కౌన్సెలింగ్ నిర్వ‌హించారు. అయితే త‌మ ప‌రువు తీసిన ఆమె త‌మ ఇంటికి రాన‌వస‌రం లేద‌ని త‌ల్లిదండ్రులు చెప్ప‌డంతో.. ఆ బాలిక‌ను చిల్డ్ర‌న్ హోంకు త‌ర‌లించారు.

ఆ త‌ర్వాత క‌ల్లం అంజిరెడ్డి వొకేష‌న‌ల్ జూనియ‌ర్ కాలేజీలో చేరింది. ఇటీవ‌ల విడుద‌లైన ఇంట‌ర్ ఫ‌లితాల్లో ఆమె 1000 మార్కుల‌కు గానూ 945 మార్కులు సాధించి, చిల్డ్ర‌న్ హోం ప్ర‌తినిధుల నుంచి ప్ర‌శంస‌లు పొందింది. త‌మ బిడ్డ‌కు వ‌చ్చిన మార్కుల‌ను చూసి త‌ల్లిదండ్రులు కూడా ఉప్పొంగిపోయారు. ఇంటికి ర‌మ్మ‌ని ఆహ్వానించారు. కానీ ఆ అమ్మాయి తాను ఇప్పుడే ఇంటికి వెళ్ల‌న‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ సంద‌ర్భంగా బాధిత విద్యార్థిని మాట్లాడుతూ.. త‌మ పేరెంట్స్ త‌న‌తో మాట్లాడ‌టం ఎంతో సంతోషాన్నిస్తుంద‌ని, ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌ని తెలిపింది. ఇప్పుడే ఇంటికి వెళ్లే ఉద్దేశం లేదు. డిగ్రీ బీకాంలో చేరి అకౌంటెన్సీలో మంచి నైపుణ్యం సాధించి, అధ్యాప‌కురాలిగా ఉద్యోగం సాధించిన త‌ర్వాతే ఇంటికి వెళ్తాన‌ని చెప్పింది. తాను త‌న ప్రియుడితో ఉంటే ఈ మార్కులు సాధించి ఉండ‌క‌పోయే దాన్నేమో అని ఆమె తెలిపింది. కానీ త‌న చ‌దువు గురించి అత‌నికి బాగా తెలుసు అని పేర్కొంది.