Damoh | బాలిక‌ల హాస్ట‌ల్ వార్డెన్ అఘాయిత్యం.. స్నానం చేస్తున్న బాలిక‌ల ఫోటోలు తీసి

Damoh స్నానం చేస్తున్న బాలిక‌ల ఫోటోలు తీసి.. మధ్యప్రదేశ్‌లోని దమోహ జిల్లలో ఘటన భోపాల్‌: హాస్టల్లో ఉండి చదువుకునే పేద విద్యార్థినులకు అండగా నిలవాల్సిన హాస్టల్‌ వార్డెన్‌.. అందునా మహిళ.. అమానుషంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని దమోహ జిల్లాలో చోటు చేసుకున్నది. ఈ జిల్లాలోని ప‌థ‌రియా గ్రామంలో క‌స్తూర్బా గాంధీ ప్ర‌భుత్వ‌ బాలిక‌ల హాస్ట‌ల్ ఉన్నది. ఆ హాస్ట‌ల్లోని మైన‌ర్ బాలిక‌లకు స్నానాలు చేసేందుకు బాత్‌రూమ్‌లు కూడా లేవు. దీంతో వారు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో స్నానాలు చేయ‌వ‌ల‌సిన […]

  • By: Somu    latest    Jul 15, 2023 12:14 PM IST
Damoh | బాలిక‌ల హాస్ట‌ల్ వార్డెన్ అఘాయిత్యం.. స్నానం చేస్తున్న బాలిక‌ల ఫోటోలు తీసి

Damoh

  • స్నానం చేస్తున్న బాలిక‌ల ఫోటోలు తీసి..
  • మధ్యప్రదేశ్‌లోని దమోహ జిల్లలో ఘటన

భోపాల్‌: హాస్టల్లో ఉండి చదువుకునే పేద విద్యార్థినులకు అండగా నిలవాల్సిన హాస్టల్‌ వార్డెన్‌.. అందునా మహిళ.. అమానుషంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని దమోహ జిల్లాలో చోటు చేసుకున్నది. ఈ జిల్లాలోని ప‌థ‌రియా గ్రామంలో క‌స్తూర్బా గాంధీ ప్ర‌భుత్వ‌ బాలిక‌ల హాస్ట‌ల్ ఉన్నది. ఆ హాస్ట‌ల్లోని మైన‌ర్ బాలిక‌లకు స్నానాలు చేసేందుకు బాత్‌రూమ్‌లు కూడా లేవు. దీంతో వారు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో స్నానాలు చేయ‌వ‌ల‌సిన దుస్థితి నెలకొన్నది. దీన్ని అవకాశంగా చేసుకున్న సదరు హాస్టల్‌ వార్డెన్‌.. తన భర్త సహకారంతో నీచ కార్యానికి ఒడిగట్టింది.

తన భర్త సహకారం కూడా తీసుకుని.. వారిని ఫొటోలు తీసి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ పాడు పని చేసిన వార్డెన్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విష‌యం తెలుసుకున్న బాలిక‌ల త‌ల్లిదండ్రులు హుటాహుటిన జిల్లా క‌లెక్ట‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్‌కు ఫిర్యాదు చేశారు. ఇంకొంత మంది బాలిక‌ల బంధువులు జిల్లా పోలీసు ఎస్పీని క‌లిసి ఈ ఘ‌ట‌న కు కార‌ణ‌మైన దోషుల‌పై వెంట‌నే చ‌ర్య తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.