Athi pandu: అత్తి పండు తింటే.. షుగర్ వ్యాధి తగ్గుతుందా?

Diabetes | Patients | Dry Fig | Anjeera | Endu Athi pandu
ప్రస్తుతం మన దేశంలో షుగర్ వ్యాధి ప్రజలను మున్న తిప్పలు పెట్టిస్తోంది. దీంతో అనేక మంది షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తాము తీసుకునే భోజనంతో పాటు సమయానికి తినేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అత్తి పండ్ల వలన కలిగే లాభాల గురించి మీకు అందించడం జరుగుతోంది.
షుగర్ వ్యాధి ఉన్నవారికి అత్తిపండు ఎంతో మేలు చేస్తుంది. ఒక అత్తిపండులో 30 కేలరీలు, 9 గ్రాముల కార్బోహైడ్రేట్, 6 గ్రాముల చక్కెర, 1 గ్రాము ఫైబర్ ఉంటాయి. ఇందులో విటమిన్లు ఏ, బి1, బి2, సి, ఐరన్, నియాసిన్, ఫోలేట్, మెగ్నీషియం, జింక్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి.
అత్తిపండులోని శోథ నిరోధక గుణాలు, ఫైబర్ వంటివి ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరచి, దాని పనితీరును క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అత్తిపండు 35 అనే చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇది అత్యంత అనుకూలమైన పండుగా చెప్పవచ్చు.
ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, గ్లూకోస్ స్పైక్స్ రాకుండా నిరోధిస్తుంది. అలాగే, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచి, మలబద్ధకం రాకుండా కాపాడుతుంది. అత్తిపండులోని ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించి, గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. అంతేకాదు, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
అత్తిపండులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు జరిగే నష్టం నుండి రక్షిస్తాయి. ముఖ్యంగా, యాంటీఆక్సిడెంట్ అయిన క్లోరోజెనిక్ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. అత్తిపండులోని కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు రోజుకు 2 అత్తిపండ్లు తినవచ్చు. అయితే, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే మాత్రలు వాడేవారు వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే అత్తిపండ్లను తినాలి.