TDP and Janasena | టీడీపీ, జనసేన మధ్య పొత్తు..? తెనాలిలో పోటీ చేసేదెవరు.?
విధాత: అసలు టీడీపీ జనసేన (TDP and Janasena) కు పొత్తు కుదురుతుందా లేదా తెలీదు.. ఏయే సీట్లు ఎవరు పంచుకుంటారు . ఎవరు పోటీ చేస్తారో తెలీదు.. కానీ ఒక సీట్ విషయం మీద మాత్రం పీట ముడి పడింది. అక్కడ టీడీపీ.. జనసేన ఇద్దరూ పోటీకి సిద్ధం అవుతున్నారు. పోనీ ఆ ఇద్దరూ అనామకులు అయితే ఏదోలా వదిలేద్దాం అనుకోవచ్చు. కానీ ఇద్దరూ సీనియర్లు.. గతంలో గట్టిగా అయా పార్టీల్లో వేళ్లూనుకున్న వాళ్ళే.. మరి […]
విధాత: అసలు టీడీపీ జనసేన (TDP and Janasena) కు పొత్తు కుదురుతుందా లేదా తెలీదు.. ఏయే సీట్లు ఎవరు పంచుకుంటారు . ఎవరు పోటీ చేస్తారో తెలీదు.. కానీ ఒక సీట్ విషయం మీద మాత్రం పీట ముడి పడింది. అక్కడ టీడీపీ.. జనసేన ఇద్దరూ పోటీకి సిద్ధం అవుతున్నారు. పోనీ ఆ ఇద్దరూ అనామకులు అయితే ఏదోలా వదిలేద్దాం అనుకోవచ్చు.
కానీ ఇద్దరూ సీనియర్లు.. గతంలో గట్టిగా అయా పార్టీల్లో వేళ్లూనుకున్న వాళ్ళే.. మరి ఆ ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి పోటీకి రెడీ..అంటుండడంతో ఏమీ చేయాలో ఇరు పార్టీలకూ పాలుపోని పరిస్థితి. గుంటూరు జిల్లా తెనాలి నుంచి
పోటీ చేస్తాం అని జనసేన లో నంబర్ టూగా ఉంటున్న నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆ నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దడం తన ఆశయం అన్నారు. కాంగ్రెస్ హయాంలో డిప్యూటీ స్పీకర్..స్పీకర్ గా పని చేసిన మనోహర్ గత పదేళ్లుగా పవన్ పక్కనే ఉంటున్నారు.
జనసేన లో పవన్ తరువాత కనిపించే రెండో ముఖం కూడా మనోహర్ కావడంతో పొత్తులో భాగంగా నాదెండ్లకు టికెట్ కేటాయిస్తారని అనుకున్నారు. టీడీపీ గట్టిగా సపోర్ట్ చేస్తే గెలుస్తామని ఆయన ఆశిస్తున్నారు.
అయితే తెనాలి టీడీపీ ఇన్‌చార్జ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా తాను తెనాలి నుంచే పోటీ చేస్తానని తేల్చి పారేశారు. అంతే కాకుండా అక్కడ జనసేనకు టికెట్ కేటాయిస్తారనే విషయాన్ని ఆయన ఖండించారు. తెనాలిలో తానే బరిలో ఉంటాను అన్నారు
ఈ ఆలపాటి ప్రకటనతో నాదెండ్ల మనోహర్ సంగతి ఏమిటన్నది తేలడం లేదు. నాదెండ్ల కోసం తాను సీట్ వదులుకునే పరిస్థితి లేదని ఆలపాటి టీడీపీ అధిష్టానానికి తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.
జనసేనలో నాదెండ్ల కీలకమైన నాయకుడు, ఇక అలాంటి వారికే టీడీపీ అంగీకరించడం లేదంటే ఇక మిగతావారి పరిస్థితి, జనసేనకు టీడీపీ ఇస్తున్న ప్రయర్టీ ఏమిటన్నది అర్థం అవుతోంది.
ఇప్పటికే పవన్‌ను గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. చింతమనేని ప్రభాకర్ వంటి నాయకులు చులకనగా చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆలపాటి సైతం అలాగే అంటుందడంతో ఏమీ చేయాలన్నది జన సైనికులు అర్థం చేసుకోలేక సతమతం అవుతున్నారు.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram