Wife Shocks Husband: శోభనం రోజున భర్తకు భార్య షాక్..ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తానని వార్నింగ్

Wife Shocks Husband: శోభనం రోజున భర్తకు భార్య షాక్..ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తానని వార్నింగ్

విధాత : మొదటి రాత్రి భార్యతో రొమాన్స్ పై రకరకాల కలలు కంటూ శోభనం గదిలోకి వెళ్లిన ఓ భర్తకు భార్య ఇచ్చిన షాక్ వైరల్ గా మారింది. తన కోసం సిగ్గుల మొగ్గల ఎదురుచూస్తుందనుకున్న భార్య సివంగిలా కత్తి పట్టుకుని నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో ఆ కొత్త పెళ్లికొడుకు గుండె సహా కలలన్ని జారిపోయాయి. అంతేనా మూడు రోజులు అదే ఇంట్లో ఉండి వరసకు మేనల్లుడైన యువకుడితో ఆ యువతి లేచిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి చెందిన నిషాద్ అనే వ్యక్తికి ఎదురైంది.

బాధితుడు నిషాద్ కథనం మేరకు…నిషాద్ కు, సితార అనే యువతితో ఇటీవల వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగిశాక కుటుంబ పెద్దలు నూతన జంటకు శోభనం ఖరారు చేశారు. భార్య పాలగ్లాసుతో ఎదురు చూస్తుందనుకుని శోభనం గదిలోకి అడుగు పెట్టిన నిషాద్ కు కత్తి పట్టుకుని కనిపించి షాక్ ఇచ్చింది. తనను ముట్టుకుంటే 35ముక్కలు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. అసలు సమస్య ఏమిటని భర్త నిషాద్ ఆమెను ప్రశ్నించడంతో మొదటి రాత్రి రోజునే తన ప్రేమ వ్యవహారం భర్తకు చెప్పేసింది. తన భార్య సితార వరసకు మేనల్లుడైన అమన్ అనే వ్యక్తిని ప్రేమించిందని, తనతోనే వెళ్లిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిందని నిషాద్ వెల్లడించాడు. అంతేకాదు తన ప్రేమికుడు అమన్  నాకు మెసేజ్ చేసి స్నేహితులతో కలిసి చంపేస్తానని బెదిరించాడని నిషాద్ పేర్కొన్నాడు.

పైగా భార్య సితార నన్ను కేదార్‌నాథ్ యాత్రకు తీసుకెళ్లమని అడిగిందని..ఇటీవల జరిగిన రాజారఘువంశి హత్య గుర్తొచ్చి ఆగిపోయాయని నిషాద్ తెలిపాడు. ఈ ఘటన తర్వాత మూడు రోజులు సితార మా ఇంట్లో ఉండి, ఒకరోజు అర్ధరాత్రి గోడ దూకి తన ప్రేమికుడితో పారిపోయిందని తెలిపాడు. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోతున్న దృశ్యాల..సీసీ కెమెరా రికార్డును కూడా నిషాద్ బయటపెట్టాడు. అయితే మూడు రోజులు తనతో ఉన్నప్పుడు ఎక్కడ తన భార్య తనను చంపేస్తుందో అని నిద్ర కూడా పోలేదని, పెళ్లి అనే మాట వింటేనే గుండెల్లో దడ పుడుతుందని నిషాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మాయిలకు ఇష్టంలేని పెళ్లి చేసినా..ఎవరినైనా ప్రేమించినా మూడు ముళ్ల తంతుకు ముందే చెబితే సరిపోతుందని..పెళ్లి చేసుకుని తర్వాత భర్తలను వేధించడం..హతమార్చడం ఎందుకని నిషాద్ హితవు పలికాడు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.