Ileana DCruz | ఇలియానాకు బాబు పుట్టాడు.. ఫొటో కూడా పెట్టేసింది.. కానీ అదే డౌటు?

Ileana DCruz | గోవా బ్యూటీ ఇలియానా.. పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందనేలా మొన్నటి వరకు వార్తలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఆ వార్తలు నిజమే అనేలా తను ప్రెగ్నెంట్ అనే విషయం సడెన్‌గా ఓ రోజు ఇన్‌స్టాలో ఫొటో పెట్టి మరీ క్లారిటీ ఇచ్చింది ఇలియానా. ఇక ఆ ఫొటో పెట్టినప్పటి నుంచి.. ఏదో రకంగా తన పేరు వార్తలలో నిలుస్తూనే ఉంది. తను కూడా జనాల్లో ఎగ్జయిట్‌మెంట్ పెంచడానికి మధ్య మధ్యలో […]

  • Publish Date - August 6, 2023 / 07:43 AM IST

Ileana DCruz |

గోవా బ్యూటీ ఇలియానా.. పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందనేలా మొన్నటి వరకు వార్తలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఆ వార్తలు నిజమే అనేలా తను ప్రెగ్నెంట్ అనే విషయం సడెన్‌గా ఓ రోజు ఇన్‌స్టాలో ఫొటో పెట్టి మరీ క్లారిటీ ఇచ్చింది ఇలియానా. ఇక ఆ ఫొటో పెట్టినప్పటి నుంచి.. ఏదో రకంగా తన పేరు వార్తలలో నిలుస్తూనే ఉంది.

తను కూడా జనాల్లో ఎగ్జయిట్‌మెంట్ పెంచడానికి మధ్య మధ్యలో తన భర్త ఎవరో చెప్పి చెప్పనట్లుగా నెటిజన్లతో గేమ్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసింది. రీసెంట్‌గా తను పెట్టిన ఫొటోతో తనకు నెలలు నిండాయని.. ఏ క్షణంలోనైనా ఆమె బిడ్డకు జన్మనివ్వవచ్చనేలా.. అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడో బిడ్డకు జన్మనిచ్చినట్లుగా వార్త.. తనే రివీల్ చేసింది.

అవును ఇలియానాకు ఆగస్ట్ 1వ తేదీన బాబు పుట్టాడు. ఈ విషయాన్ని తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. అంతేకాదండోయ్.. బిడ్డ పేరు, ఫొటోని కూడా షేర్ చేసింది. అంతా బాగానే ఉంది కానీ.. అసలు క్యారెక్టర్‌ని మాత్రం రివీల్ చేయలేదు. అదే.. దీనంతటికి కారణమైన వాడిని మాత్రం ఇలియానా ఇంకా దాచిపెడుతూనే ఉంది.

అయితే ఆమె బిడ్డకు పెట్టిన పేరు ప్రకారం ఏదో క్లూ ఇచ్చినట్లుగా అయితే అర్థమవుతోంది. ఇంతకీ బిడ్డ పేరు ఏమిటంటే.. ‘కోవా ఫీనిక్స్ డోలన్’. ఈ పేరుని కాస్త గట్టిగా సెర్చ్ చేసి కొడితే.. అసలోడి పేరు బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే అంత ఓపిక మాత్రం జనాలకు లేదనే చెప్పాలి.

సరేలే గానీ.. బిడ్డ ఆగస్ట్ 1వ తేదీన పుడితే.. ఆమె మాత్రం ఆగస్ట్ 5వ తేదీన మ్యాటర్ రివీల్ చేసింది. తను ప్రెగ్నెంట్ అనే విషయంలో, అలాగే దానికి కారణమైన వాడి విషయంలో.. ఇప్పుడు బిడ్డ పుట్టిన విషయంలో.. ఇలియానా వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తున్నా.. ఇది ఆమె పర్సనల్ లైఫ్ కాబట్టి.. ఇంతకంటే ఎక్కువగా, లోతుగా వెళ్లడం మంచిది కాదు.


పుట్టిన బిడ్డకు స్వాగతం.. ఆ బిడ్డకు జన్మనిచ్చిన ఈ నడుమందాల భామకు శుభాకాంక్షలు చెప్పడం తప్ప.. ఆమె విషయంలో ఇంకెంత జుట్టు పీక్కున్నా ఉపయోగం లేదు. అయినా.. ఇన్ని విషయాలు చెప్పిన ఇలియానా.. ఆ అసలు విషయాన్ని కూడా ఏదో ఒక రోజు రివీల్ చేస్తుంది కాబట్టి.. ఇంతటితో ఈ మ్యాటర్ వదిలేద్దాం.

Latest News