పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‌గా చేయమన్నారు: మంత్రి మల్లారెడ్డి (VIDEO)
విధాత: తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని, పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‌గా నటించమని హరీశ్ శంకర్ అడిగారు.. గంటసేపు బతిమిలాడినా పవన్ సినిమాలో విలన్‌గా చేయనని చెప్పానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేం ఫేమస్ చిత్రం టీజర్‌ను విడుదల చేసిన సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. మంత్రి మల్లారెడ్డి మాటలు.. ఫేమస్ అంటే ఎవరు.. ఎట్ల అయితరు.. మీరంతా బీర్ తాగి, సిగరెట్లు తాగి, గంజాయి తాగి, లవర్స్ వెంట తిరిగితే ఫేమస్ కారు. ఫేమస్ కావాలంటే […]

విధాత: తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని, పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‌గా నటించమని హరీశ్ శంకర్ అడిగారు.. గంటసేపు బతిమిలాడినా పవన్ సినిమాలో విలన్‌గా చేయనని చెప్పానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేం ఫేమస్ చిత్రం టీజర్‌ను విడుదల చేసిన సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు.
మంత్రి మల్లారెడ్డి మాటలు.. ఫేమస్ అంటే ఎవరు.. ఎట్ల అయితరు.. మీరంతా బీర్ తాగి, సిగరెట్లు తాగి, గంజాయి తాగి, లవర్స్ వెంట తిరిగితే ఫేమస్ కారు. ఫేమస్ కావాలంటే కష్టపడాలి. పాలు అమ్మినా.. పువ్వులు అమ్మినా.. కాలేజీలు పెట్టినా.. టాప్ డాక్టర్లను తయారు చేసినా.. అది ఫేమస్.. అది ఫేమస్.. జీన్స్ పాయింట్లు వేసుకుంటే ఫేమస్ కారు. యూత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. పబ్లిక్‌లో ఉంటేనే ఫేమస్ అవుతారు. నేను తుమ్మితే కూడా తుపాన్ అవుతుంది.
నేను ఎందుకు ఫేమస్ అయ్యానో తెలుసా.. హార్డ్ వర్క్ చేశాను కాబట్టే ఫేమస్ అయ్యాను. నేను డాక్టర్‌ను కాదు.. ఇంజినీర్‌ను కాదు.. ప్రొఫెసర్‌ను కాదు.. అయినా కూడా సింపుల్ లివింగ్.. లో ప్రొఫైల్.. హై థింకింగ్ అది మల్లారెడ్డి మోడల్.. అందుకే ఫేమస్ అయ్యాను.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ యువతకు సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. ఇప్పుడు తెలంగాణ యువతకు సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఎన్నికల తర్వాత తెలంగాణ యాసలో ఐదారు సినిమాలు నిర్మిస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు.