చైనా, పాక్ సరిహద్దుల్లోకి త్వరలో 307 హోవిట్జర్‌ల మోహరింపు..!
త్వరలోనే చైనా, పాక్‌తో సరిహద్దులైన వాస్తవాధీన రేఖ (LAC), నియంత్రణ రేఖ (LOC)ల వెంట 307 ఏటీఏజీఎస్ హోవిట్జర్లను మోహరించనున్నారు

DRDO | త్వరలోనే చైనా, పాక్‌తో సరిహద్దులైన వాస్తవాధీన రేఖ (LAC), నియంత్రణ రేఖ (LOC)ల వెంట 307 ఏటీఏజీఎస్ హోవిట్జర్లను మోహరించనున్నారు. రెండు దేశాలతో సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అత్యాధునిక గన్స్‌ను మోహరించేందుకు సిద్ధమైంది. 307 అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ (ఏటీఏజీఎస్) తొలి ఆర్డర్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఉంచవచ్చని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ తెలిపారు.
గత ఏడాది మార్చిలో చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో 307 హోవిట్జర్ గన్‌లను మోహరించాలని రక్షణ మంత్రిత్వ శాఖకు ఆర్మీ ప్రతిపాదించింది. స్వదేశీ 155 ఎంఎంx 52 క్యాలిబర్ హోవిట్జర్ గన్స్‌ను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్‌తో కలిసి డీఆర్డీవో అభివృద్ధి చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DDO) ఈ ఏడాది మార్చి నాటికి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఎగుమతి చేసే అవకాశం ఉందని సమీత్ వీ కామత్ పేర్కొన్నారు.
పది రోజుల్లో పది రోజుల్లో క్షిపణుల గ్రౌండ్ సిస్టమ్‌లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందన్నారు. ఏటీఏజీఎస్ 307 గన్స్‌కు విదేశాల నుంచి ఆర్డర్లు ఈ ఆర్థిక సంవత్సరం నాటికి రావచ్చన్నారు. ఫిలిప్పీన్స్‌తో పాటు పలు దేశాలు బ్రహ్మోస్ క్షిపణిపై ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ఏటీఏజీఎస్ గన్స్ ట్రయల్స్ అన్నీ పూర్తయ్యాయని, ఎగుమతికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వాటికి మార్చి 31 వరకు ఆర్డర్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గన్స్‌తో పాటు ఎల్‌సీఏ ఎంకే-1ఏ, అర్జున్ ఎంకే-1ఏ, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ తదితర మిస్సైల్ భారత త్రివిధ దళాల్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు.