Indian Railway | అత్యవసర పరిస్థితుల్లో రైలు టికెట్‌ దొరకడం లేదా..! ఇలా చేయండి బెర్త్‌ పక్కా..!

Indian Railway | భారతీయ రైల్వేల్లో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారంతా ముందస్తుగానే టికెట్లు బుక్‌ చేసుకుంటారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే వారు మాత్రం తత్కాల్‌లో బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. చాలా సమయంలో తాత్కాల్‌ కోటాలో టికెట్లు దొరకడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్ఓ కోటా ద్వారా బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉన్నది. హెచ్ఓ కోటాను హై అఫీషియల్ కోటాగా పిలుస్తుంటారు. దీంతో వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న రైలు టికెట్లను […]

Indian Railway | అత్యవసర పరిస్థితుల్లో రైలు టికెట్‌ దొరకడం లేదా..! ఇలా చేయండి బెర్త్‌ పక్కా..!

Indian Railway |

భారతీయ రైల్వేల్లో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారంతా ముందస్తుగానే టికెట్లు బుక్‌ చేసుకుంటారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే వారు మాత్రం తత్కాల్‌లో బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. చాలా సమయంలో తాత్కాల్‌ కోటాలో టికెట్లు దొరకడం కష్టమే.

ఇలాంటి పరిస్థితుల్లో హెచ్ఓ కోటా ద్వారా బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉన్నది. హెచ్ఓ కోటాను హై అఫీషియల్ కోటాగా పిలుస్తుంటారు. దీంతో వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న రైలు టికెట్లను సైతం ఇందులో సులభంగా కన్ఫామ్‌ చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ప్రయాణించే వారికి, వీఐపీలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కాగా, ఈ సదుపాయాన్ని టికెట్‌ బుకింగ్‌ సమయంలో ఉపయోగించలేం. ప్రయాణికులు మొదట సాధారణ వెయిటింగ్ లిస్ట్‌తో టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత హెడ్ క్వార్టర్ ద్వారా టికెట్ కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది.

అయితే, జనరల్ కోటాతో బుక్ చేసిన టికెట్స్, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్లను హెచ్ఒ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. టికెట్ కన్ఫర్మేషన్‌ అధికారులు చార్ట్‌ను తయారు చేసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. సాధారణ ప్రజలు సైతం హెచ్ఓ కోటా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందు కోసం ప్రయాణ తేదీ కంటే ఒక రోజు ముందు రిజర్వేషన్‌ కౌంటర్‌కు వెళ్లి.. అత్యవసరంగా ప్రయాణానికి సంబంధించి కారణాన్ని చెబుతూ.. ఎమర్జెన్సీ కోటా ఫామ్‌ను నింపాలి. ఆ తర్వాత దాన్ని చీఫ్‌ రిజర్వేషన్ సూపర్ వైజర్‌కు అందజేయాలి.

హెచ్ఓ కోటా ద్వారా ట్రైన్ టికెట్ కన్ఫర్మేషన్‌ చేయాలని దరఖాస్తు రాసి.. గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో ఇవ్వాలి. ఈ సమాచారం రైల్వే డివిజనల్, జోనల్ కార్యాలయానికి పంపుతారు. రైల్వే అధికారులు ఆమోదిస్తే.. టికెట్ కన్ఫామ్ అవుతుంది. మరి అత్యవసర పరిస్థితుల్లో ఈ విధానంలో మీరూ అప్లయ్‌ చేసుకోండి మరి..!