Vande Bharat |
విధాత: ఇండియన్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో స్లీపర్ వెర్షన్‌ను తీసుకురానున్నట్టు వెల్లడించింది. అక్టోబర్ 31 లోపు కొత్త వెర్షన్ రైలును ప్రయాణికులను అందుబాటులోని తేనునున్నట్టు ప్రకటించింది.
భారత రైల్వే కొత్తగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇప్పటి వరకు ప్రయాణికులు కూర్చొని మాత్రమే వెళ్లే సదుపాయం ఉండగా, కొత్త వెర్షన్‌లో పడుకొని వెళ్లే సౌలభ్యం అందుబాటులోకి రానున్నది.
ఈ అంశంపై శనివారం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా మాట్లాడాడు. “మేము ఈ ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ స్లీపర్ వెర్షన్‌ను విడుదల చేస్తాం. వందే మెట్రోను కూడా ప్రారంభిస్తాం.
నాన్-ఎయిర్ కండిషన్డ్ ప్రయాణికుల కోసం దీనిని నాన్-ఏసీ పుష్-పుల్ రైలు అని పిలుస్తారు. ఇందులో 22 కోచ్‌లు, లోకోమోటివ్ ఉంటుంది. అక్టోబర్ 31 లోపు ఇవి అందుబాటులోకి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి”. అని వివరించారు