Vasalamarri: సీఎం KCR దత్తత గ్రామం.. వాసాలమర్రిలో అభివృద్ధి పనుల పరిశీలన!

విధాత: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులను యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. హెల్త్ సబ్ సెంటర్, మూడు అంగన్వాడీ కేంద్ర భవనాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల భవన నిర్మాణాలు ప్రారంభించుటకు సన్నాహక కార్యక్రమాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి పర్యవేక్షణలో చేపట్టారు. హెల్త్ సబ్ సెంటర్, ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కొండాపూర్ రోడ్డులో గతంలో తొలగించిన హాస్టల్ స్థలంలో నిర్మాణం […]

Vasalamarri: సీఎం KCR దత్తత గ్రామం.. వాసాలమర్రిలో అభివృద్ధి పనుల పరిశీలన!

విధాత: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులను యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. హెల్త్ సబ్ సెంటర్, మూడు అంగన్వాడీ కేంద్ర భవనాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల భవన నిర్మాణాలు ప్రారంభించుటకు సన్నాహక కార్యక్రమాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి పర్యవేక్షణలో చేపట్టారు.

హెల్త్ సబ్ సెంటర్, ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కొండాపూర్ రోడ్డులో గతంలో తొలగించిన హాస్టల్ స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించారు. ఇందుకు పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు ప్రారంభించారు.

ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను పరిశీలించి అదే స్థలంలో నూతన భవన నిర్మాణాలను, రెండో అంగన్వాడీ కేంద్ర భవనమును నిర్మించుటకు అడిషనల్ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఆయా పనులను వెంటనే ప్రారంభించాలని టీఎస్ డబ్ల్యూ ఈఐడిసి డిఈ శివకుమార్ ను ఆదేశించారు.

అదేవిధంగా గ్రామ పరిధిలో రామ్ శెట్టిపల్లిలో గతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, అదే స్థలంలో నూతన భవనం నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని పంచాయతీరాజ్ ఈ ఈ వెంకటేశ్వర్లను ఆదేశించారు.

కార్యక్రమంలో డిపిఓ సునంద, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మండల స్పెషల్ ఆఫీసర్ జినుకల శ్యామ్ సుందర్, డి ఎం హెచ్ వో మల్లికార్జున్ రావు, డిప్యూటీ డిఎంహెచ్వో శిల్పిని, పంచాయితీ రాజ్ ఈ ఈ వెంకటేశ్వర్లు, డిఈ గిరిధర్, టీఎస్ డబ్ల్యు ఈఐడీసీడి ఈ శివకుమార్, సెక్టోరల్ ఆఫీసర్ అండాలు, ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు , ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్, ఎంపీడీవో మానే ఉమాదేవి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు సుధీర్ రెడ్డి, ఏఈ తులసి కృష్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.