అవినాష్ రెడ్డికి మధ్యంతర బెయిల్.. సుప్రీంను ఆశ్రయించిన సునీతా రెడ్డి.

విధాత: అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ సవాల్ చేస్తూ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ రోజు సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటీషన్ ను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. అత్యవసరంగా కేసును విచారించాలన్న సునీతారెడ్డి తరపు లాయర్ వాదనను విన్న సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా డివై చంద్రచూడ్ రేపు విచారిస్తామని తెలిపారు. అయితే వివేకా హత్య కేసులో మధ్యంతర బెయిల్ […]

  • By: krs    latest    Apr 20, 2023 8:11 AM IST
అవినాష్ రెడ్డికి మధ్యంతర బెయిల్.. సుప్రీంను ఆశ్రయించిన సునీతా రెడ్డి.

విధాత: అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ సవాల్ చేస్తూ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ రోజు సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటీషన్ ను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు.

అత్యవసరంగా కేసును విచారించాలన్న సునీతారెడ్డి తరపు లాయర్ వాదనను విన్న సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా డివై చంద్రచూడ్ రేపు విచారిస్తామని తెలిపారు.

అయితే వివేకా హత్య కేసులో మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అవినాశ్ రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వగా 25న తుది తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.