IPL-2023 SRH Vs RR | రాజస్థాన్‌పై.. చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్..! నిరాశకు గురైన అభిమానులు
IPL-2023 SRH Vs RR | విధాత: ఇండియన్ ప్రీమియర్ లీగ్-15వ సీజన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ప్రారంభించింది. హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ జట్టు 72 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ మొదటి నుంచి దూకుడును కొనసాగించింది. ఓపెనర్లు యసశ్వీ జైస్వాల్, జోస్ బట్లర్ శుభారంభం అందించారు. టాప్ ఆర్టర్ సైతం రాణించడంతో […]

IPL-2023 SRH Vs RR |
విధాత: ఇండియన్ ప్రీమియర్ లీగ్-15వ సీజన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ప్రారంభించింది. హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ జట్టు 72 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ మొదటి నుంచి దూకుడును కొనసాగించింది.
ఓపెనర్లు యసశ్వీ జైస్వాల్, జోస్ బట్లర్ శుభారంభం అందించారు. టాప్ ఆర్టర్ సైతం రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. బట్లర్ (54), జైస్వాల్ (54), కెప్టెన్ సంజూ శాంసన్ (55) హాఫ్‌సెంచరీలతో చెలరేగిపోయారు. చివరి ఓవర్లలో షిమ్రాన్ హిట్‌మేయిర్ (22) సైతం దంచికొట్టాడు. హైదరాబాద్ బౌలర్లలో ఫజల్‌హక్ ఫారుఖీ, నటరాజన్ రెండేసి వికెట్ల తీయగా.. ఉమ్రాన్ మాలిక్‌కు ఒక వికెట్ దక్కింది.
ఆ తర్వాత 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ ఓపెన్ అభిషేక్ శర్మతో పాటు ఫస్ట్‌డౌట్ బ్యాటర్ రాహుల్ తిప్రాఠిలను పెవిలియన్‌కు పంపాడు. ఇద్దరు ఓపెన్లు సున్నా స్కోర్లకు వెనుదిరిగడంతో హైదరాబాద్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్ సింగిల్స్, డబుల్స్ తీస్తూ.. చెత్త బంతులను బౌండరీలు బాది స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.
హ్యారీ బ్రూక్ (13), ఓపెనర్ మయాంక్ (27) కలిసి మూడో వికెట్‌కు 34 పరుగులు జోడించారు. ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన చాహల్ హ్యారీ బ్రూక్‌ను పెలివిలియన్‌కు పంపాడు. 34 పరుగులకే హైదరాబాద్ మూడు వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో మునిగింది. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (1), గ్లెన్ ఫిలిప్స్ (8), అదిల్ రషీద్ (18), భువనేశ్వర్‌కుమార్ (6) వరుసగా వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ జట్టు ఓటమికి దగ్గరైంది.
చివరి ఓవర్లలో అబ్దుల్ సమద్ (32), ఉమ్రాన్ మాలిక్ (19) రాణించడంతో హైదరాబాద్ 130 పరుగులు చేసింది. ఒక దశలో 100 పరుగులు చేయడం కూడా కష్టమేనన్న దశలో ఇద్దరు కలిసి హైదరాబాద్ జట్టు పరువును కాపాడారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్‌కు నాలుగు, బౌల్ట్‌కు రెండు, అశ్విన్, హోల్డర్‌కు తలా ఒక వికెట్ దక్కింది.
దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్‌లో జరుగుతున్న మ్యాచ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సీజన్‌లోనైనా హైదరాబాద్ ఆటతీరుతో ఆకట్టుకుంటుందని భావించినా.. తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ ఆటతీరును చూసి అభిమానులు నిరాశకు గురయ్యారు.