IRCTC SOUTH INDIA TEMPLE RUN | దక్షిణ భారత్‌లోని ఆలయాలను దర్శించుకోవాలనుకుంటున్నారా..? మీ కోసమే ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్..!
IRCTC SOUTH INDIA TEMPLE RUN | దక్షిణ భారతదేశంలోని ఆలయాలను దర్శించుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. కన్యాకుమారి, రామేశ్వరం, మధురై, తిరుచిరాపల్లి, తిరువనంతపురం, పద్మనాభస్వామి తదితర ఆలయాలను దర్శించుకోవాలనుకునే వారి కోసం ప్యాకేజీని ప్రకటించింది. సౌత్ ఇండియా టెంపుల్ రన్ (SOUTH INDIA TEMPLE RUN) పేరుతో ఎయిర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆగస్ట్ 13న ప్యాకేజీ ప్రారంభంకానున్నది. హైదరాబాద్ నుంచి టూర్ మొదలుకానుండగా.. ఏడు రోజులు, ఆరు రాత్రులు కొనసాగుతుంది. జర్నీ […]

IRCTC SOUTH INDIA TEMPLE RUN |
దక్షిణ భారతదేశంలోని ఆలయాలను దర్శించుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. కన్యాకుమారి, రామేశ్వరం, మధురై, తిరుచిరాపల్లి, తిరువనంతపురం, పద్మనాభస్వామి తదితర ఆలయాలను దర్శించుకోవాలనుకునే వారి కోసం ప్యాకేజీని ప్రకటించింది. సౌత్ ఇండియా టెంపుల్ రన్ (SOUTH INDIA TEMPLE RUN) పేరుతో ఎయిర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆగస్ట్ 13న ప్యాకేజీ ప్రారంభంకానున్నది. హైదరాబాద్ నుంచి టూర్ మొదలుకానుండగా.. ఏడు రోజులు, ఆరు రాత్రులు కొనసాగుతుంది.
జర్నీ ఇలా..
Day 1st : తొలిరోజు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణం మొదలవుతుంది. ఉదయం 5.10 గంటలకు విమానం బయలుదేరి.. 6.50 గంటల వరకు తిరువనంతపురం చేరుకుంటుంది. హోటల్‌లోకి చేరుకున్న తర్వాత అల్పాహారం చేసి నేపియర్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం పూవార్ ద్వీపం, సాయంత్రం అజిమల శివాలయాన్ని సందర్శిస్తారు. రాత్రి త్రివేండ్రంలో బస ఏర్పాటు చేస్తారు.
Day 2nd : ఉదయం అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కన్యాకుమారి బయలుదేరాల్సి ఉటుంది. దారిలో పద్మనాభపురం ప్యాలెస్ సందర్శిస్తారు. సాయంత్రం సన్‌సెట్ పాయింట్‌లో సూర్యాస్తమయాన్ని వీక్షిస్తారు. రాత్రి కన్యాకుమారిలోనే బస ఏర్పాటు చేస్తారు.
Day 3rd : ఉదయం అల్పాహారం చేసి రాక్ మెమోరియల్ సందర్శనకు వెళ్తారు. అనంతరం రామేశ్వరం బయలుదేరుతారు. సాయంత్రానికి రామేశ్వరం చేరుకుంటారు. రాత్రికి రామేశ్వరంలోనే భోజనం, బస చేయాల్సి ఉంటుంది.
Day 4th : నాలుగో రోజు ఉదయం అల్పాహారం తర్వాత రామేశ్వర ఆలయం దర్శనకు వెళ్తారు. అనంతరం ధనుష్కోడికి వెళ్తారు. పర్యాటకులు సొంత ఖర్చులతోనే ధనుష్కోడికి వెళ్లాలి ఉంటుంది. మళ్లీ రాత్రికి రామేశ్వరం చేరుకుంటారు. రాత్రి భోజనం చేసుకొని అక్కడే బస చేస్తారు.
Day 5th : ఐదో రోజు ఉదయం అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి అబ్దుల్ కలాం మెమోరియల్ సందర్శన ఉంటుంది. అనంతరం తంజావూరు బయలుదేరుతారు. అక్కడ తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరుచిరాపల్లికి చేరుకుంటారు. రాత్రికి తిరుచిరాపల్లిలోనే భోజనం, బస ఉంటుంది.
Day 6th : ఆరో రోజు ఉదయం టిఫిన్ చేసిన అనంతరం శ్రీరంగం ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మధురైకి వెళ్తారు. సాయంత్రం మధురైకి చేరుకుని హోటల్ చెకిన్ అవుతారు. రాత్రికి మధురైలోనే బస చేయాల్సి ఉంటుంది.
Day 7th : ఏడో రోజు ఉదయం అల్పాహారం అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ ఉంటుంది. అక్కడ నుంచి మధురైలో మీనాక్షి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి 6.50 గంటలకు మధురై విమానాశ్రయంలో విమానం ఎక్కితే రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
సౌత్ ఇండియా టెంపుల్ రన్ ప్యాకేజీ ధర
సౌత్ ఇండియా టెంపుల్ రన్ ప్యాకేజీ ధర విషయానికి వస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.47వేలు చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీలో రూ.34వేలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.32,250 చెల్లిస్తే సరిపోతుంది. టూర్ ప్యాకేజీలో విమాన టికెట్ల చార్జీలు, హోటల్‌లో బస, అల్పాహారం, డిన్నర్, ఏసీ బస్సుల్లో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నీ కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం IRCTC వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA23