IRCTC Tour Package | ఒకే ప్యాకేజీలో ఆరు క్షేత్రాల సందర్శన..! పర్యాటలకు ఐఆర్‌సీటీసీ బంపర్‌ ఆఫర్‌..!

IRCTC Tour Package | ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) గత నెల మార్చిలో సికింద్రాబాద్‌ నుంచి భారత్‌ రైలును ప్రారంభించింది. ఈ రైలుకు పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో పర్యాటకుల కోసం సరికొత్త ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలులో పుణ్యక్షేత్ర యాత్ర (Punya Kshetra Yatra) ప్రకటించింది. ఈ యాత్ర ఈ నెల 27న మొదలవనున్నది. ఈ ప్యాకేజీలో […]

IRCTC Tour Package | ఒకే ప్యాకేజీలో ఆరు క్షేత్రాల సందర్శన..! పర్యాటలకు ఐఆర్‌సీటీసీ బంపర్‌ ఆఫర్‌..!

IRCTC Tour Package | ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) గత నెల మార్చిలో సికింద్రాబాద్‌ నుంచి భారత్‌ రైలును ప్రారంభించింది. ఈ రైలుకు పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో పర్యాటకుల కోసం సరికొత్త ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలులో పుణ్యక్షేత్ర యాత్ర (Punya Kshetra Yatra) ప్రకటించింది.

ఈ యాత్ర ఈ నెల 27న మొదలవనున్నది. ఈ ప్యాకేజీలో పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లోని పలు క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. యాత ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజులు కొనసాగుతుంది. ప్యాకేజీ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రారంభంకానున్నది. కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం రైల్వే స్టేషన్లలో భారత్‌ గౌరవ్‌ రైలు ఆగనున్నది.

పర్యటన సాగుతుందిలా..

తొలిరోజు భారత్‌ గౌరవ్‌ రైలు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రయాణం షురూ అవుతుంది. కాజీపేట, ఖమ్మం, విజయవాడ , ఏలూరు, రాజమండ్రి , సామర్లకోట రైల్వే స్టేషన్లలో నిలుస్తుంది. రెండోరెజు పెందుర్తి, విజయనగరం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. అదే రోజు మాల్తీపాత్‌పూర్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి పూరీ బయలుదేరాల్సి ఉంటుంది.

అదే రోజు పూరీలో కొలువైన జగన్నాథస్వామిని దర్శించుకోవచ్చు. రాత్రి పూరీలోనే బస చేయాల్సి ఉంటుంది. ఇక మూడో రోజు ఉదయం కోణార్క్‌ వెళాల్సి ఉంటుంది. అక్కడ సూర్యనారాయణ దేవాలయాల్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి గయ బయలుదేరుతారు. నాలుగో రోజు గయ చేసుకుంటారు. అక్కడ పెద్దలకు పిండ ప్రదానాలు చేయవచ్చు.

అనంతరం విష్ణుపాద ఆలయాన్ని సందర్శన ఉంటుంది. ఆ తర్వాత కాశీకి బయలుదేరి వెళ్తారు. ఐదో రోజు కాశీకి చేరుకుంటారు. అనంతరం అక్కడ విశ్వనాథ దేవాలయం, వారణాసి కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయం సందర్శించవచ్చు. సాయంత్రం గంగాహారతి చూడొచ్చు. ఆ తర్వాత అయోధ్య బయలుదేరుతారు.

ఆరో రోజు అయోధ్య చేరాక రామజన్మభూమి, హనుమాన్‌గఢి ఆలయాలను దర్శించుకోవడంతో పాటు సాయంత్రం సరయూ నదీ తీరంలో హారతిలో కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రయాగ్‌రాజ్‌ బయలుదేరుతారు. ఏడో రోజు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం సందర్శిస్తారు. హన్మాన్‌ మందిర్‌, శంకర్‌ విమాన్‌ మండపం సందర్శిస్తారు.

ఆ తర్వాత మళ్లీ తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఎనిమిదో రోజు విజయనగరం, పెందుర్తి, సామర్లకోటకు చేరుతుంది. తొమ్మిదో రోజు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట్, సికింద్రాబాద్ చేరవడంతో యాత్ర ముగుస్తుంది.

పుణ్యక్షేత్ర ప్యాకేజీ ఎంతంటే..?

పుణ్య క్షేత్ర ప్యాకేజీ ఐఆర్‌సీటీసీ మూడు కేటగిరిల్లో అందుబాటులో ఉంచింది. ఎకానమి డబుల్, ట్రిపుల్ షేర్‌లో ఒక్కొక్కరికి రూ.15,120 కాగా, సింగిల్ షేర్ ధర రూ.16,625. స్టాండర్డ్‌ డబుల్‌, ట్రిపుల్ షేర్ ధర రూ.23,995 కాగా, సింగిల్ షేర్ ధర రూ.25,770కే అందుబాటులో ఉంచింది. ఇక కంఫర్ట్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.31,435 కాగా, సింగిల్ షేర్ ధర రూ.34,010గా ఉన్నది.

ఎకానమీ కేటగిరీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బస, స్టాండర్డ్ కేటగిరీలో థర్డ్ ఏసీ ప్రయాణం, కంఫర్ట్ కేటగిరీలో సెకండ్ ఏసీ ప్రయాణం ఉంటుంది. ఏసీ గదుల్లో బస, వాహనాల్లో సైట్ సీయింగ్, టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయని ఐఆర్‌సీటీసీ వివరించింది.