High Court | కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికలో అవకతవకలు.. హైకోర్టుకు బండి సంజ‌య్‌

High Court | Bandi Sanjay హైద‌రాబాద్‌, విధాత: కరీనంగర్‌ అసెంబ్లీ ఎన్నికలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా ఎంపీ బండి సంజయ్‌ హైకోర్టుకు హాజరయ్యారు. గత విచారణ సందర్భంగా పిటిషనర్‌ సాక్ష్యం రికార్డు చేయాలని న్యాయమూర్తి ఆదేశించడంతో.. సోమ‌వారం బండి సంజయ్‌ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజ‌య్ సాక్ష్యాన్ని న్యాయమూర్తి రికార్డు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ శాసనసభ్యుడిగా గంగుల కమలాకర్‌ ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ ఆఫీసర్‌(ఆర్‌వో) ప్రకటించడం చట్టవిరుద్ధమని.. […]

  • Publish Date - July 10, 2023 / 03:11 PM IST

High Court | Bandi Sanjay

హైద‌రాబాద్‌, విధాత: కరీనంగర్‌ అసెంబ్లీ ఎన్నికలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా ఎంపీ బండి సంజయ్‌ హైకోర్టుకు హాజరయ్యారు. గత విచారణ సందర్భంగా పిటిషనర్‌ సాక్ష్యం రికార్డు చేయాలని న్యాయమూర్తి ఆదేశించడంతో.. సోమ‌వారం బండి సంజయ్‌ కోర్టుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజ‌య్ సాక్ష్యాన్ని న్యాయమూర్తి రికార్డు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ శాసనసభ్యుడిగా గంగుల కమలాకర్‌ ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ ఆఫీసర్‌(ఆర్‌వో) ప్రకటించడం చట్టవిరుద్ధమని..

ఎన్నికలో అవకతవకలు జరిగాయని ఆర్‌వో ప్రకటనను కొట్టివేసి, తను ఎన్నికైనట్లు ప్రకటించాలని కోరుతూ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ 2019లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. బండి సంజ‌య్ సాక్ష్యాన్ని రికార్డ్ చేసిన జస్టిస్ చిల్లకూర్‌ సుమలత త‌దుప‌రి విచారణను జూలై 21వ తేదీకి వాయిదా వేశారు.