Jairam Ramesh
న్యూఢిల్లీ: మణిపూర్‌పై చర్చించేందుకు తాము సిద్ధమని, ప్రతిపక్షం ఎందుకు సిద్ధం కావడం లేదో అర్థం కావడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొనడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది.
పత్రికల్లో పతాక శీర్షికలకెక్కే యావతోనే అమిత్ షా మాటలు ఉన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ విమర్శించారు. ఆయన ప్రత్యేకంగా ఒరగబెడుతున్నది ఏమీ లేదని అన్నారు.
మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలన్న ప్రతిపక్షం డిమాండ్ విషయంలో అమిత్‌షా పూర్తి మౌనం పాటించారని ఆరోపించారు.
‘మణిపూర్ విషయంలో ముందుగా ప్రధాని ప్రకటన చేయాలని, ఆ తర్వాత చర్చ జరగాలని ప్రతిపక్ష ఇండియా కూటమి చేస్తున్న డిమాండ్ పూర్తిగా ప్రజాస్వామికం, చట్టబద్ధమైనది.
కానీ.. ఈ విషయంలో అమిత్‌షా పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. పార్లమెంటులో ప్రధాని మాట్లాడేందుకు ఇబ్బంది ఏమిటి?’ అని ఆయన విమర్శించారు.