Janagama | భూ కబ్జా చేశార‌ని.. దంపతుల ఆత్మహత్యాయత్నం

Janagama విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా నర్మెట్ట మండలం సూర్య తండాలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. త‌మ భూమిని దళారుల ఆక్రమించార‌ని ఆవేదన చెందిన దంపతులిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వారి పరిస్థితి విషమించడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దంప‌తులిద్ద‌రికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆత్మహ‌త్య‌కు సంబంధించి సూసైడ్ నోట్ కూడా రాశారు. లేఖ‌లో తమ భూమిని కబ్జాకు పాల్పడిన వారి పేర్లు […]

  • By: krs    latest    Aug 13, 2023 12:41 AM IST
Janagama | భూ కబ్జా చేశార‌ని.. దంపతుల ఆత్మహత్యాయత్నం

Janagama

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా నర్మెట్ట మండలం సూర్య తండాలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. త‌మ భూమిని దళారుల ఆక్రమించార‌ని ఆవేదన చెందిన దంపతులిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వారి పరిస్థితి విషమించడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

దంప‌తులిద్ద‌రికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆత్మహ‌త్య‌కు సంబంధించి సూసైడ్ నోట్ కూడా రాశారు. లేఖ‌లో తమ భూమిని కబ్జాకు పాల్పడిన వారి పేర్లు రాసినట్టు స‌మాచారం. ఈ సంఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.