KA Paul | నా మాట విననందుకే బాబుకు కటకటాలు: కేఏ పాల్
KA Paul ఆ నలుగురూ తోడుదొంగలే ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ విధాత, ప్రతినిధి నిజామాబాద్: ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు 22 సార్లు నా ఆశీర్వాదం తీసుకున్నారని, మారాలని చెప్పినని, మారలేదని నా మాట విననందుకే ఈరోజు కటకటాల పాలయ్యారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో నిర్వహించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు […]

KA Paul
- ఆ నలుగురూ తోడుదొంగలే
- ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్
విధాత, ప్రతినిధి నిజామాబాద్: ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు 22 సార్లు నా ఆశీర్వాదం తీసుకున్నారని, మారాలని చెప్పినని, మారలేదని నా మాట విననందుకే ఈరోజు కటకటాల పాలయ్యారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో నిర్వహించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ,కేసీఆర్, జగన్, మోడీలు అంతా తోడుదొంగలు, అవినీతి పరులేనని విమర్శించారు.
తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ 119 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తుందన్నారు. తనను సీఎంగా గెలిపిస్తే సొంత డబ్బులతో నియోజకవర్గానికి ఒక్క హెలికాఫ్టర్ , అంబులెన్సు, కార్పొరేట్ హాస్పిటల్ ను తలదన్నే విధంగా ఆసుపత్రిని కట్టిస్తానన్నారు. జమిలి ఎన్నికలను పెట్టడం వల్ల బీజేపీకి రాజకీయ లబ్ధి జరుగుతుందని ఊహించి జమిలికి సిద్దపడుతుందని ఎద్దేశా చేశారు.
బీజేపీకి బీఆరెస్ పార్టీ బీటీమ్ అన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం అసలే లేదని, వారు టికెట్లు అమ్ముకుంటూ అవినీతిపరులకు టికెట్లు ఇస్తున్నారన్నారని ఆరోపించారు. వివిధ పార్టీలలో టికెట్లు రాని ఆశావహులను ఎంపిక చేసి వారికి మా ప్రజాశాంతి పార్టీ తరపున టికెట్ ఇస్తామన్నారు.
ప్రజాశాంతి పార్టీ గెలిచాక సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం ఉండి ఎలాంటి లాభాపేక్ష చూడని నాయకులు ముందుకు రావాలని, రాజకీయ పార్టీలు స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. నేను రాజకీయాలకు రాకమందు లక్షల కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. విద్య వైద్యం ఉపాధి అవకాశాలే ఎజెండాగా ముందుకు సాగుతామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఒక్కో కుటుంబానికి ఆరు లక్షల అప్పుచేసాడని, ధరణిలో లక్షల ఎకరాలు కనిపించకుండా ఎటుపోయాయని ప్రశ్నించారు. ఈవిఎం వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అని, ఈవీఎంల వలన దేశంలో, రాష్ట్రంలో ఓట్లు గల్లంతవుతున్నాయన్నారు.
ఒకరికి ఓటు వేస్తే మరొకరికి ఓటు పడి గందరగోళంగా మారుతున్నాయని, బ్యాలెట్ తోనే ఓటింగ్ నిర్వహించాలని ప్రజాశాంతి పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ మానవ హక్కుల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు మహేందర్ తో పాటు జిల్లా ప్రజాశాంతి పార్టీ నాయకులు పాల్గొన్నారు.