మేఘాతో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కు
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మేఘా కృష్ణారెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కై 1000కోట్లకు అమ్ముడుపోయి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఎవరిని అరెస్టు చేయలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు

- నాతో పెట్టుకుని మాజీ సీఎంలు నష్టపోయారు
- ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్
విధాత : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మేఘా కృష్ణారెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కై 1000కోట్లకు అమ్ముడుపోయి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఎవరిని అరెస్టు చేయలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తుందని, అధికార దాహంతో బీజేపీ నేతలు 400సీట్లు అంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలకులు 25లక్షల కోట్లు కార్పోరేట్ పెద్దలకు దోచి పెట్టారని విమర్శించారు. తెలంగాణలో బీఆరెస్ భూస్థాపితమవ్వగా, బీజేపీ ఎనిమిది స్థానాలకే పరిమితం అయ్యిందన్నారు. నన్ను చంపించడానికి కేసీఆర్ నాపై మూడు కేసులు వేశాడని, రాజశేఖర్ రెడ్డి నన్ను చంపాలని ముక్కలు అయిపోయాడని, నాతో పెట్టుకున్న మాజీ సీఎంలు దెబ్బతిన్నారన్నారు.
మేఘా కృష్ణారెడ్డి నన్ను చంపగలిగాడా అని ప్రశ్నించారు. శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే కేసీఆర్‌ను చిత్తు గా ఓడించానని, కవిత జైలుకు వెళుతుందని ముందే చెప్పానంటూ చెప్పుకున్నారు. కేసీఆర్ కట్టిన 330 కోట్ల సెక్రటీరియల్ ఏమైందని, ప్రజలతో పెట్టుకుంటే అందులో ఆయనకు స్థానం దక్కలేదన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పుల్లో కురుకుపోయిందన్నారు. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్, బీజేపీలను ఓడించి చైతన్యం చాటరని చెప్పారు. తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చి నన్ను చాలా సార్లు కలిశారని, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ను కూడా భూ స్థాపితం చేసిన రోజున ప్రజలు బాగుపడుతారని పేర్కోన్నారు.
రేవంత్ గురువు చంద్ర బాబు చెప్తే తెలంగాణాలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తానన్నారు. నేను అగ్ర కులంలో పుట్టలేదనే మా బీసీ లకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వడం లేదన్నారు. మునుగోడు ఎన్నికల్లో ఈవిమ్ ట్యాపింగ్ జరిగిందని లేదంటే నేను గెలిచేవాడినన్నారు. తెలంగాణ ప్రజలు నీటి సమస్య తీవ్రంగా ఉందని, తెలంగాణ సాగు తాగునీటిని మంత్రిని మార్చమని చెప్పానని వెల్లడించారు. ఇంకో తమ్ముడు కోమటిరెడ్డి చాలా చెపుతున్నాడని, రైతు బందు డబ్బులు ఐదు వేల కోట్లు ఎటు పోయాయని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా అభివృద్ధి ఫై బీఆరెస్, కాంగ్రెస్ నేతలు అబద్దపు మాటలు చెపుతున్నారన్నారు. ఏపీలో రాజకీయ నాయకులందరిని డిస్ క్వాలిపై చేయాలన్నారు.
ఏపీలో డ్రగ్ మాఫియాను ప్రోత్సహిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపాలని డిమాండ్ చేశారు. ప్రజా శాంతి అభ్యర్థి బాబు మోహన్‌ను వరంగల్ లో గెలిపించాలని కోరారు. నల్గొండ నుండి లోక్ సభకు ప్రజా శాంతి పార్టీ పోటీలో ఉంటుందని, నా మాటలు అన్ని మీడియా సంస్థలు లైవ్ ఇవ్వాలని. నా మాటలను చూపించక పోతే మీడియా సంస్థలు అన్ని ఇబ్బందులు పడుతాయని, ఇదే నా శాపం మీడియా సంస్థలకు నా హెచ్చరిక నేను దేవుని దూతను..మీ కోసం వచ్చా..మీడియా హక్కులను కాపాడుతా..అవసరమైతే నా స్పిరిచువల్ పవర్ వాడుతానని పాల్ పేర్కోన్నారు.