Kanguva | సూర్య కంగువ గ్లింప్స్ విడుదల.. వణుకు పుట్టిస్తుందిగా..!
Kanguva: సౌత్‌లో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించే హీరోలలో సూర్య ఒకరు. ఆయన కంటెంట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాడు. ఇటీవల మంచి సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత సూర్య `కంగువ` పేరుతో భారీ పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఇందులో ఆయన యుద్ధ వీరుడిగా కనిపించనుండగా, తన పాత్రతో ప్రేక్షకులకి రోమాలు నిక్కపొడుచుకునేలా చేయనున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబధించి విడుదలైన ఫస్ట్ లుక్ లు ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండడంతో పాటు సినిమాపై భారీ […]

Kanguva: సౌత్‌లో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించే హీరోలలో సూర్య ఒకరు. ఆయన కంటెంట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాడు. ఇటీవల మంచి సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత సూర్య ‘కంగువ’ పేరుతో భారీ పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఇందులో ఆయన యుద్ధ వీరుడిగా కనిపించనుండగా, తన పాత్రతో ప్రేక్షకులకి రోమాలు నిక్కపొడుచుకునేలా చేయనున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబధించి విడుదలైన ఫస్ట్ లుక్ లు ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇక సూర్య పుట్టిన రోజు(జులై 23) సందర్భంగా ‘కంగువ’ గ్లింప్స్ ని అర్థరాత్రి 12గంటల 1 నిమిషానికి విడుదల చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు.
గ్లింప్స్ చూస్తుంటే సినిమా అంతా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సూర్యలోని మరో యాంగిల్‌ని మనం ఈ సినిమాలో చూడబోతున్నాం. దట్టమైన ఫారెస్ట్ లో ప్రత్యర్థులు అంతా యుద్ధంలో చనిపోయి నీళ్లలో తేలియాడుతూ ఉంటారు. అప్పుడు ఒకరు మాత్రం తిరుగుబాటుకి ప్రయత్నం చేస్తుంటాడు.అతడే సూర్య. నిప్పులు కొలువలతో బాణాలు దూసుకొస్తుండగా ధైర్యంగా బయటకి వస్తాడు కంగువా(సూర్య). చిత్రంలో ఆదివాసి వీరుడిగా కనిపించిన సూర్య చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ అందరిని భయపెట్టిస్తున్నాడు కూడా.
సూర్య గెటప్ అదిరిపోయింది. ఫారెస్ట్ ఏరియాలో ఆదివాసి తెగల నాయకుడిగా సూర్య(కంగువ) మాత్రం ప్రేక్షకులకి మంచి ఫీస్ట్ అందించడం ఖాయంగా కనిపిస్తుంది. డైరెక్టర్ శివ, ఆయన టీమ్ కలిసి ‘కంగువ’ సినిమాని చిత్రీకరిస్తుండగా, ఇందులో బీజీఎం అదిరిపోయింది. కంగువని పరిచయం చేసే ప్రారంభ సన్నివేశాలు, డైలాగులు అదరహో అనేలా ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని రూపొందిస్తుండగా, ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ఇందులో దిశా పటానీ కథానాయికగా నటిస్తుండగా, పది భాషల్లో ఈ చిత్రాన్ని సమ్మర్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. సూర్య గత చిత్రాలకి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని గ్లింప్స్ తో అర్ధమైంది.