Kannappa: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కన్నప్ప టీజర్.. అంతా ఆ స్టార్ లుక్ కోసమే

విధాత: మంచు విష్ణు (Vishnu Manchu ) డ్రీమ్ ప్రాజెక్టుగా మవచు ఫ్యామిలీ నిర్మాణంలో ప్రతిష్టాల్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప (Kannappa). ఒక్క టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్, మలయాళం, తమిళ, కన్నడ భాషలన్నింటి నుంచి చాలామంది ప్రముఖ నటీనటులు ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తుండడం విశేషం. సుమారు రెండేండ్ల క్రితం షూటింగ్ ప్రారంభైన ఈ సినిమా పూర్తిగా న్యూజిలాండ్‌లో జరుపుకుంది. ఎప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా నుంచి గత మూడు నెలలుగా ప్రతి సోమవారం రోజున మూవీలో ఒక్కో కీలక పాత్రధారికి సంబంధించిన లుక్స్, వారి పాత్రలను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇటీవల విడుదల చేసిన పాట కూడా సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ను గమనిస్తే ప్రజల నుంచి మంచి అటెన్షన్ తీసుకునేలానే ఉంది.
ఈ మూవీలో మోహన్ లాల్ (Mohanlal), రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మోహన్ బాబు (Mohan Babu M), అక్షయ్ కుమార్ (Akshay Kumar), శివ రాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, కాజోల్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు. . అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ఈ చిత్రాన్నిభారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.
‘స్టార్‌ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా సీనియర్ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్, తోట ప్రసాద్ ఈ కథకు తుది మెరుగులు దిద్దారు, మలయాళ సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవాసి సంగీతం అందించారు.
కొద్ది గంటల క్రితమే విడుదలైన ఈ టీజర్ సోషల్‌మీడియాలో, యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. తక్కువ సమయంలో హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకుని కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. అయితే ఈ వ్యూస్‌లో అధిక భాగం ప్రభాస్ లుక్ కోసమే వచ్చాయంటే అతిశయోక్తి కాదు. అంతలా ప్రభాస్ లుక్ ఆయన అభిమానులను అకట్టుకోవడంతో సామాజిక మాధ్యమాల్లో దేశ వ్యాప్తంగా ప్రభాస్ పేరు టాప్1లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.