Karimnagar | తెలంగాణలో దశాబ్దికాలంగా విద్యా విధ్వంసం

Karimnagar జలగల్లా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టదు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ విధాత బ్యూరో, కరీంనగర్: ఎంతోమంది ఆశలు, ఆంక్షలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు గడిచిన విద్యా వ్యవస్థ బాగుపడింది, పేద విద్యార్థులకు న్యాయం జరిగింది లేదన్నారు. గతంలో కార్పొరేట్ […]

Karimnagar | తెలంగాణలో దశాబ్దికాలంగా విద్యా విధ్వంసం

Karimnagar

  • జలగల్లా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టదు
  • ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ

విధాత బ్యూరో, కరీంనగర్: ఎంతోమంది ఆశలు, ఆంక్షలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు గడిచిన విద్యా వ్యవస్థ బాగుపడింది, పేద విద్యార్థులకు న్యాయం జరిగింది లేదన్నారు.

గతంలో కార్పొరేట్ శక్తులను పొలిమేర చివరి దాకా తరిమికొడతానని నమ్మ బలికిన ముఖ్యమంత్రి కార్పొరేటు శక్తులకు కొమ్ముకాస్తూ, పొలిమేర చివరిదాకా కార్పొరేట్ విద్యాసంస్థల్ని విస్తరింప
చేశారని విమర్శించారు. శుక్రవారం స్థానిక ప్రెస్ భవన్ లో ఆమె విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్ విద్యాసంస్థలు పేద ప్రజల రక్తాన్ని ఫీజుల రూపంలో జలగల్లా పీలుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు.

గతంలో కేజీ టు పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అందిస్తామని హామీలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నేడు విద్యతో వ్యాపారం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని విమర్శించారు. మన ఊరు మన బడి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని, ఇందుకోసం 7000 కోట్లు కేటాయిస్తున్నామని ఆర్భాటం చేసిన ముఖ్యమంత్రి ప్రకటనలకే పరిమితం అయ్యారని
మండిపడ్డారు.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో మనబడి కార్యక్రమం కోసం 3500 కోట్లు కేటాయించి పాఠశాలలు అభివృద్ధి చేస్తామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయకుండా,పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి చేతులు దులుపుకుంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు.

పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా, టీచింగ్ ,నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయకుండా, సరైన మౌలిక వసతులు కల్పించకుండా విద్యా వ్యవస్థను ప్రభుత్వం నాశనం చేసిందన్నారు.

శాతవాహన యూనివర్సిటీకి సరిపడా నిధులు కేటాయించకపోవడం టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం, మౌలిక వసతులు కల్పించకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్య పూరిత వైఖరికి నిదర్శనం అన్నారు. ఒక ప్రాథమిక పాఠశాలకు ఉన్నటువంటి విలువకూడా శాతవాహన యూనివర్సిటీకి లేకుండా పోయిందన్నారు. ఈ విశ్వవిద్యాలయాన్ని మూసివేయాలనే ధోరణి అధికారులలో కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విలేకరుల సమావేశంలో నగర కార్యదర్శి పూసాల విష్ణు, జోనల్ ఇన్చార్జులు నందు, నితీష్, శ్రీ వర్ధన్, సంయుక్త కార్యదర్శులు అనూష, సంహిత్, రాకేష్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.