Nirmal | దశాబ్ది ఉత్సవాల సంబరాలలోయాదవుల నిరసన

Nirmal గొర్లు కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆరోప‌ణ‌ ఐదు రోజులు ఆంధ్రలో తిప్పి గొర్లు కొనుగోలు చేయని అధికారులు విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండో విడత గొర్ల పంపిణీ పథకంలో అధికారుల నిర్లక్ష్యం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది. రెండో విడత గొర్ల పంపిణీ ద్వారా గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంటే అధికారులు గోర్లను కొనుగోలు చేయడానికి రైతులతో పాటు వెళ్లకుండా మూడు […]

Nirmal | దశాబ్ది ఉత్సవాల సంబరాలలోయాదవుల నిరసన

Nirmal

  • గొర్లు కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆరోప‌ణ‌
  • ఐదు రోజులు ఆంధ్రలో తిప్పి గొర్లు కొనుగోలు చేయని అధికారులు

విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండో విడత గొర్ల పంపిణీ పథకంలో అధికారుల నిర్లక్ష్యం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది.

రెండో విడత గొర్ల పంపిణీ ద్వారా గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంటే అధికారులు గోర్లను కొనుగోలు చేయడానికి రైతులతో పాటు వెళ్లకుండా మూడు రోజుల తర్వాత వెళ్లి కొనకుండానే తిరిగి వచ్చారని గొల్ల కురుమలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖానాపూర్ పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ సంబరాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో యాదవులు తమ నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఖానాపూర్ మండలంలో యాదవులకు రెండో విడత గొర్ల పంపిణీ కోసం 18 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఐదు రోజులు తిరిగినప్పటికీ గొర్రెలు లేకపోవడంతో గొర్లు కొనుగోలు చేసే అధికారులు మా వెంబడి రాకుండా మూడు రోజుల తర్వాత వచ్చారని, ఐదు రోజులపాటు గుంటూరులో తిరిగితే మనిషికి 10,000 ఖర్చు అయ్యాయని కనీసం అధికారులు భోజన వసతి కూడా కల్పించలేదని రైతులు ఆరోపించారు.

పశుసంవర్ధక శాఖ అధికారులకు యాదవులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది… ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ గొర్లను కొనుగోలు చేసి ఇస్తామని హామీ ఇవ్వడంతో యాదవులు నిరసన విరమించారు.