Karimnagar | బీఆర్‌ఎస్‌తో బ్రేకప్ కాలేదు.. దక్షిణాదిపై బీజేపీది అత్యాశే: సాంబశివరావు

Karimnagar విధాత: బీఆర్‌ఎస్‌తో సీపీఐ బంధానికి ఇంకా బ్రేకప్ కాలేదని, వచ్చే ఎన్నికల్లో కుదిరితే ఆ పార్టీతో పొత్తు ఉంటుందని లేదంటే సింగిల్‌గానే వామపక్షాలు పోటీ చేస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కరీనంగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతు పొత్తుల కోసం వెంపర్లాడటం లేదని, మా గౌరవానికి భంగం వాటిల్లితే సహించబోమన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ మద్దతు లేకపోతే అక్కడ బీజేపీనే గెలిచేదన్నారు. తెలంగాణ ఆంద్రప్రదేశ్‌లలో బీజేపీ ఆశలు వదిలేసుకుందని, ఇప్పటికే ఏడు […]

  • Publish Date - July 9, 2023 / 11:58 AM IST

Karimnagar

విధాత: బీఆర్‌ఎస్‌తో సీపీఐ బంధానికి ఇంకా బ్రేకప్ కాలేదని, వచ్చే ఎన్నికల్లో కుదిరితే ఆ పార్టీతో పొత్తు ఉంటుందని లేదంటే సింగిల్‌గానే వామపక్షాలు పోటీ చేస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కరీనంగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతు పొత్తుల కోసం వెంపర్లాడటం లేదని, మా గౌరవానికి భంగం వాటిల్లితే సహించబోమన్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ మద్దతు లేకపోతే అక్కడ బీజేపీనే గెలిచేదన్నారు. తెలంగాణ ఆంద్రప్రదేశ్‌లలో బీజేపీ ఆశలు వదిలేసుకుందని, ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన బీజేపీ దక్షిణాదిపై పెట్టుకున్న ఆశలు అత్యాశనే మిగిలిస్తాయన్నారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎందుకు తొలగించారో ఆ పార్టీ నాయకత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని వరంగల్ పర్యటన నిరాశ మిగిల్చిందని, తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు, విభజన హామీలపై ప్రస్తావన లేకపోవడం విచారకరమన్నారు.