Karimnagar | స్కూల్‌లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ.. కుప్పకూలిన విద్యార్థిని!

Karimnagar విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంగాధర మోడల్ స్కూల్ లో విద్యార్థుల ఫ్రెషర్స్ డే సందర్భంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా కుప్పకూలిన విద్యార్థిని ప్రదీప్తిని హాస్పిటల్ తరలించేలోగా మృతి చెందిన సంఘటన విద్యార్థుల్లో విషాదాన్ని నింపింది. గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన గుండు అంజయ్య, శారదల కూతురు గుండు ప్రదీప్తి గంగాధర మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈనెల15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గాను విద్యార్థులు డ్యాన్స్ ప్రాక్టీస్ […]

Karimnagar | స్కూల్‌లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ.. కుప్పకూలిన విద్యార్థిని!

Karimnagar

విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంగాధర మోడల్ స్కూల్ లో విద్యార్థుల ఫ్రెషర్స్ డే సందర్భంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా కుప్పకూలిన విద్యార్థిని ప్రదీప్తిని హాస్పిటల్ తరలించేలోగా మృతి చెందిన సంఘటన విద్యార్థుల్లో విషాదాన్ని నింపింది.

గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన గుండు అంజయ్య, శారదల కూతురు గుండు ప్రదీప్తి గంగాధర మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈనెల15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గాను విద్యార్థులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ప్రదీప్తి ఒక్కసారిగా కింద పడిపోయింది.

వెంటనే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సీపీఆర్ చేసి కరీంనగర్ హాస్పిటల్ కు తరలించగా అక్కడ వైద్యులు విద్యార్థిని మృతి చెందినట్లు తెలిపారు. కాగా ప్రదీప్తికి చిన్నతనంలోనే గుండెకు రంధ్రం ఉందని వైద్యులు తెలుపగా ఆర్థిక స్తోమత లేని కుటుంబ సభ్యులు గుండె ఆపరేషన్ చేయించలేకపోయారు.

మోడల్ స్కూల్ లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ప్రదీప్తి ఒక్కసారి కుప్పకూలిపోవడం హాస్పిటల్ తరలించేలోగా మృతి చెందడం, ప్రతిరోజు తమతో ఉండే తమ తోటి విద్యార్థిని మృతి చెందడం విద్యార్థులను తీవ్రంగా కలచివేయగా విద్యార్థి కుటుంబంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు విద్యార్థి మృతదేహాన్ని తమ స్వగ్రామం వెంకటాయపల్లి గ్రామానికి తీసుకెళ్లారు.