Karnataka CM | సిద్ధరామయ్యే CM.. డిప్యూటీగా DK శివకుమార్‌

Karnataka CM ఢిల్లీలో పార్టీ నేత వేణుగోపాల్‌ ప్రకటన ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చిన పెద్దలు చెప్పినట్టే.. సీఎం సీటును త్యజించిన డీకే పార్టీ ప్రయోజనాల కోసమేనని వ్యాఖ్య ఒప్పించిన పార్టీ అగ్రనాయకురాలు సోనియా రేపు సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం విధాత‌: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నది. త్యాగాలు చేయడానికి సిద్ధమని ముందే ప్రకటించిన డీకే శివకుమార్‌ ఎట్టకేలకు సీఎం సీటును త్యాగం చేశారు. కర్ణాటక తదుపరి […]

  • Publish Date - May 18, 2023 / 03:51 AM IST

Karnataka CM

  • ఢిల్లీలో పార్టీ నేత వేణుగోపాల్‌ ప్రకటన
  • ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చిన పెద్దలు
  • చెప్పినట్టే.. సీఎం సీటును త్యజించిన డీకే
  • పార్టీ ప్రయోజనాల కోసమేనని వ్యాఖ్య
  • ఒప్పించిన పార్టీ అగ్రనాయకురాలు సోనియా
  • రేపు సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం

విధాత‌: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నది. త్యాగాలు చేయడానికి సిద్ధమని ముందే ప్రకటించిన డీకే శివకుమార్‌ ఎట్టకేలకు సీఎం సీటును త్యాగం చేశారు. కర్ణాటక తదుపరి సీఎంగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్‌ ఖరారుచేసింది.

సిద్ధరామయ్యను సీఎంగా పార్టీ హైకమాండ్‌ నిర్ణయించినట్టు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ పేరును ప్రకటించారు.

డీకే డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడిగానూ కొనసాగుతారని వేణుగోపాల్ వెల్లడించారు. ఈ నెల 20న‌ సిద్ధ‌రామ‌య్య ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ఇందుకు బెంగ‌ళూరులోని కంఠీర‌వ స్టేడియంలో ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

సోనియా బుజ్జ‌గింపుతో మెత్త‌ప‌డ్డ డీకే

ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ బ‌రిలో నిలిచారు. మూడు రోజుల చ‌ర్చ‌ల అనంత‌రం కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధ‌రామ‌య్య‌ను సీఎం ప‌దవికి ఎంపిక‌చేసిన‌ట్టు వార్త‌లు వెలువ‌డ్డాయి. డిప్యూటీగా శివ‌కుమార్‌ను నిర్ణ‌యించిన‌ట్టు బుధ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి.

బుధ‌వారం రాత్రి ఒక్క‌సారిగా ప్ర‌తిష్ఠంభ‌న నెల‌కొన్న‌ది. సీఎం డిమాండ్‌పై శివకుమార్ దృఢంగా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో సోనియా రంగంలోకి దిగి.. శివకుమార్‌ను ఒప్పించారని సమాచారం.

మా అన్న సీఎం కాలేకపోయారు..

శివకుమార్ త్యాగం చేయాలని నిర్ణయించుకున్నారని, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, డీకేఎస్ తమను సంతోషపెట్టలేదని డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ అన్నారు.

”కర్ణాటక, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. మా అన్న ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. కానీ కాలేకపోయారు. ఈ నిర్ణయంతో మేము సంతోషంగా లేము” అని చెప్పారు.

Latest News