Madal Virupakshappa | వక్కలు అమ్మి ఆ రూ.8.23కోట్లు సంపాదించా..! : కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప

Madal Virupakshappa | అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మాదాల్‌ విరూపాక్షప్ప ఇటీవల తన ఇంట్లో దొరికిన సొత్తుపై క్లారిటీ ఇచ్చారు. వక్కల (betel nuts) విక్రయం ద్వారా వచ్చిన డబ్బే ఇంట్లో, కార్యాలయాల్లోకి వచ్చిందన్నారు. ఇటీవల ఇల్లు, కార్యాలయంలో లోకాయుక్త పోలీసులు రూ.8.23కోట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలో ఓ కాంట్రాక్టర్‌ నుంచి ఎమ్మెల్యే తనయుడు లంచం తీసుకుంటూ లోకాయుక్త పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే కనిపించకుండాపోయారు. అరెస్టు చేయకుండా […]

Madal Virupakshappa | వక్కలు అమ్మి ఆ రూ.8.23కోట్లు సంపాదించా..! : కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప

Madal Virupakshappa | అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మాదాల్‌ విరూపాక్షప్ప ఇటీవల తన ఇంట్లో దొరికిన సొత్తుపై క్లారిటీ ఇచ్చారు. వక్కల (betel nuts) విక్రయం ద్వారా వచ్చిన డబ్బే ఇంట్లో, కార్యాలయాల్లోకి వచ్చిందన్నారు. ఇటీవల ఇల్లు, కార్యాలయంలో లోకాయుక్త పోలీసులు రూ.8.23కోట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలో ఓ కాంట్రాక్టర్‌ నుంచి ఎమ్మెల్యే తనయుడు లంచం తీసుకుంటూ లోకాయుక్త పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే కనిపించకుండాపోయారు. అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. ఈ మేరకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా చన్నెష్‌పూర్‌లో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో అధికార పార్టీ శాసనసభ్యుడిపై దాడి చేయడం ఇదే మొదటిసారి అని, మమ్మల్ని ట్రాప్‌ చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు.

లోకాయుక్త సరైన పత్రాలు ఇస్తా

భారీగా వక్కలు (betel nuts) తోటలు ఉన్నాయని, సామాన్య రైతు ఇంట్లో రూ.5కోట్ల నుంచి రూ.6కోట్లు ఉంటాయన్నారు. నాకు 125 ఎకరాలు పొలం ఉందని, అరకనట్‌ మార్కెట్‌తో పాటు అనేక వ్యాపారాలున్నాయని, తాను లోకాయుక్తకు సరైన పత్రాలు ఇచ్చి నా డబ్బులను తిరిగి తీసుకుంటానని తెలిపారు. కేఎస్‌డీఎల్‌ కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం విధితమే. ఆ తర్వాత జరిపిన దాడుల్లో మాదాల్ కుటుంబీకుల ఇంట్లో రూ.8.23 కోట్ల నగదు, భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు, భూముల్లో భారీగా పెట్టుబడులు బయటపడ్డాయి. దీనిపై స్పందిస్తూ తన కొడుకు నిర్దోషి అని తెలిపారు. తనను ట్రాప్ చేసేందుకు ఎవరో రూ.40 లక్షలు తన ఛాంబర్‌లో ఉంచారని ఆరోపించారు.