Warangal | BJP విధానాలకు కర్ణాటక ఫలితం గుణపాఠం: మంత్రి సత్యవతి
Warangal కాళ్లు పట్టుకున్నా కాంగ్రెస్‌ను నమ్మరు ప్రతిపక్షాలపై రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రతిపక్షాలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం వంటి దుర్మార్గపు పనులకు కర్ణాటకలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఒక గుణపాఠమని రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మోదీ వచ్చి గల్లీ గల్లీ, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా.. కాంగ్రెసోళ్లు […]

Warangal
- కాళ్లు పట్టుకున్నా కాంగ్రెస్‌ను నమ్మరు
- ప్రతిపక్షాలపై రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రతిపక్షాలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం వంటి దుర్మార్గపు పనులకు కర్ణాటకలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఒక గుణపాఠమని రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మోదీ వచ్చి గల్లీ గల్లీ, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా.. కాంగ్రెసోళ్లు కాళ్లావేళ్లా పడ్డా.. పేదల గుండెల్లో గూడు కట్టుకున్న కేసీఆర్‌ను ఎవరూ ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం మంత్రి సత్యవతి పర్యటించారు. ఆమె వెంట భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కమలాపూర్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో HDFC పరివర్తన్ వారు7 కోట్ల రూపాయలతో డిజిటల్ తరగతి గదిని, చెల్పూరులో 50 లక్షలతో నిర్మిచిన మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను, జిల్లా కేంద్రంలో రూ. 66 లక్షలతో సఖి వన్ స్టాప్ సెంటర్‌ను అనంతరం అంబులెన్స్ ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నారా. బీజేపీ-కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతుబంధు ఇచ్చే సంస్కారం ఎక్కడైనా ఉందా. ఆభివృద్ధిపై ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందన్నారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో గెలిచి, కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సి ఎస్ ఆర్ ప్రాజెక్టు కింద హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు వారు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడడం సంతోషకరం.
గతంలో ఒక కోటితో అభివృద్ధికి సహకారం అందించగా, ఈ ఏడాది మరో ఏడు కోట్లతో ఈ ప్రాంత అభివృద్ధికి సహకారం అందిస్తున్న హెచ్ డి ఎఫ్ సి సంస్థను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.