Kaushik Reddy | దూకుడు పెంచిన పాడి కౌశిక్.. రేపు పార్టీ నేతలతో సమావేశం
హుజురాబాద్ బీఆర్ఎస్‌ను కంట్రోల్‌లోకి తెచ్చుకునే ఎత్తుగడ విధాత బ్యూరో, కరీంనగర్: వివాదాస్పద వ్యాఖ్యలు, దూకుడుగా ముందుకు సాగే తీరుతో నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచే ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) హుజురాబాద్ బీఆర్ఎస్‌పై పట్టు సాధించే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితుడైన మరుక్షణమే పార్టీ వర్గాలతో భేటీకి ఆయన ముహూర్తం ఫిక్స్ చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు హుజురాబాద్ సిటీ సెంట్రల్‌లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల […]

- హుజురాబాద్ బీఆర్ఎస్‌ను కంట్రోల్‌లోకి తెచ్చుకునే ఎత్తుగడ
విధాత బ్యూరో, కరీంనగర్: వివాదాస్పద వ్యాఖ్యలు, దూకుడుగా ముందుకు సాగే తీరుతో నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచే ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) హుజురాబాద్ బీఆర్ఎస్‌పై పట్టు సాధించే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితుడైన మరుక్షణమే పార్టీ వర్గాలతో భేటీకి ఆయన ముహూర్తం ఫిక్స్ చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు హుజురాబాద్ సిటీ సెంట్రల్‌లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, ఎంపీపీలు,జెడ్పీటీసీ లు, మున్సిపల్ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్ లు, కో-ఆప్షన్ సభ్యులు, సింగిల్ విండో ఛైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సర్పంచులు, ఎంపిటీసీలు, ఉపసర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సొసైటీ డైరెక్టర్లు, పార్టీ మహిళా విభాగం నేతలు, పార్టీ అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొనాలని ఆయన హుకుం జారీ చేశారు.
గెల్లు రాకముందే.. ఇల్లు చక్కదిద్దాలని
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ రెండు రోజుల క్రితమే పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆ హోదాలో ఆయన నియోజకవర్గానికి రాకముందే,
బీఆర్ఎస్ యంత్రాంగాన్ని మొత్తం తన ఆధీనంలోకి తీసుకోవాలన్న కౌశిక్ వ్యూహం ఆయన దూకుడు రాజకీయ విధానానికి అర్థం పడుతుంది.
హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్.. అడ్డంకులు తొలగిస్తున్న BRS అధిష్టానం
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ హోదాలో పలువురు మంత్రులను కలుస్తూ ఆశీర్వాదం తీసుకుంటున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పార్టీ అధిష్టానం ఆ సంతోషం కాస్త మిగిలనివ్వకుండా చేసింది.
అటు రాష్ట్రస్థాయి చైర్మన్ పదవి కట్ట పెట్టి ఇటు నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుండి తప్పించడం ద్వారా
నియోజకవర్గ అధికార పార్టీలో రెండు కేంద్రాలకు తావు లేదనే విషయాన్ని పార్టీ అధిష్టానం స్పష్టం చేసినట్టు అయింది.
తమ నేతకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి దక్కిందని సంతోషపడాలో, నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి పోయిందని బాధపడాలో తెలియని స్థితిలో గెల్లు మద్దతు దారులు కొట్టుమిట్టాడుతున్నారు. కార్పొరేషన్ చైర్మన్ హోదాలో గెల్లు శ్రీనివాస్ హుజురాబాద్ లో అడుగుపెట్టిన తర్వాత ఆయన, ఆయన అనుచరుల ఆలోచన తీరును బట్టి హుజురాబాద్ బీఆర్ఎస్ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి.
గెల్లు శ్రీనివాస్ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించి సైలెంట్ గా ఉండిపోతే సమస్య లేదు.
ఒకవేళ ఆయన సైలెంట్ గా ఉండిపోదామన్నా… అనుచరులు అందుకు అంగీకరిస్తారా? అన్నది ప్రశ్న.
హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలలో గెల్లు శ్రీనివాస్ ఫోటో ఎక్కడ కనబడకుండా చూడడంలో ఇప్పటివరకు సఫలీకృతుడైన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, చైర్మన్ హోదాలో శ్రీనివాస్ హుజురాబాద్ రాక సందర్భంగా ఫ్లెక్సీలు, హంగు ఆర్భాటాలవైపు పార్టీ నేతలు వెళ్లకుండా కట్టడి చేసే కార్యక్రమంలో భాగమే
నియోజకవర్గ సమస్త పార్టీ నేతల భేటీ అని చెవులు కోరుక్కుంటున్న వారు లేకపోలేదు.