మెదక్ బీఆరెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్‌రామ్ రెడ్డి
మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన బీఆరెస్. మెదక్ పార్లమెంట్ సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్ రామ్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్

విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన బీఆరెస్. మెదక్ పార్లమెంట్ సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్ రామ్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్ లతో పాటు ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మధన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే పార్టీ ముందుగా ఒంటేరు ప్రతాప్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరగింది. దీంతో ఒంటేరుకు టికెట్ ఇస్తే తాము పదవులకు రాజీనామా చేస్తామని గజ్వేల్ నియోజక వర్గ నేతలు ఎలక్షన్ రెడ్డి తదితరులు వ్యతిరేకించినట్లు సమాచారం. అందుకే వెంకట్ రామ్ రెడ్డిని అధిష్టానం ప్రకటించిందని పార్టీ నేతలు అంటున్నారు.