Gold Coins | 185 ఏళ్లనాటి బంగారు నాణేలు ల‌భ్యం

Gold Coins అమెరికాలోని కెంట‌కీ మొక్క‌జొన్న చేనులో నిధి కెంటకీ: అప్పుడ‌ప్పుడు మనం ఊహించ‌ని కొన్ని వింత‌లు, విడ్డూరాలు సంభ‌విస్తుంటాయి. అటువంటి వింతే ఒక‌టి అమెరికాలో జ‌రిగింది. కెంటకీలోని ఒక మొక్క‌జొన్న‌ చేనులో పనిచేసుకుంటున్న రైతుకు బంగారు నాణేలు దాచి ఉంచిన నిధి ఒకటి దొరికింది. ఈ అరుదైన 700 బంగారు నాణేలు అమెరికాలో జ‌రిగిన అంత‌ర్యుద్ధ కాలం నాటివని గుర్తించారు. ఇవి 1840 నుండి 1863 వ‌ర‌కు చెలామణిలో ఉన్నాయని పురాత‌త్వ వేత్త‌లు తెలిపారు. వీటి […]

Gold Coins | 185 ఏళ్లనాటి బంగారు నాణేలు ల‌భ్యం

Gold Coins

  • అమెరికాలోని కెంట‌కీ మొక్క‌జొన్న చేనులో నిధి

కెంటకీ: అప్పుడ‌ప్పుడు మనం ఊహించ‌ని కొన్ని వింత‌లు, విడ్డూరాలు సంభ‌విస్తుంటాయి. అటువంటి వింతే ఒక‌టి అమెరికాలో జ‌రిగింది. కెంటకీలోని ఒక మొక్క‌జొన్న‌ చేనులో పనిచేసుకుంటున్న రైతుకు బంగారు నాణేలు దాచి ఉంచిన నిధి ఒకటి దొరికింది. ఈ అరుదైన 700 బంగారు నాణేలు అమెరికాలో జ‌రిగిన అంత‌ర్యుద్ధ కాలం నాటివని గుర్తించారు.

ఇవి 1840 నుండి 1863 వ‌ర‌కు చెలామణిలో ఉన్నాయని పురాత‌త్వ వేత్త‌లు తెలిపారు. వీటి విలువ 2 మిలియన్‌ డాలర్లు ఉంటుందని పాత నాణేల డీలర్‌ ఒకరు అంచనా వేశారు. వీటిలో 1 డాలర్‌ గోల్డ్ ఇండియన్స్, 10 డాలర్‌ గోల్డ్ లిబర్టీస్, 20 డాలర్ల గోల్డ్ లిబర్టీస్ ఉన్నాయి. నాణేలను కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచారు.