Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం!

తెలంగాణలో సంచలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సోమవారం రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికాలో తలదాచుకుంటున్న కీలక నిందితులు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ టీవీ చానల్ అధినేత శ్రవణ్ కుమార్ లపై ఓ వైపు రెడ్ కార్నర్ నోటీస్ జారీ కాగా వారిని రాష్ట్ర పోలీసులు ఇండియా రప్పించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నిందితులు ఇద్దరు ముందస్తు బెయిల్ కోసం భారత న్యాయ స్థానాలను ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం!

Phone Tapping Case:

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సోమవారం రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికాలో తలదాచుకుంటున్న కీలక నిందితులు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ టీవీ చానల్ అధినేత శ్రవణ్ కుమార్ లపై ఓ వైపు రెడ్ కార్నర్ నోటీస్ జారీ కాగా వారిని రాష్ట్ర పోలీసులు ఇండియా రప్పించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నిందితులు ఇద్దరు ముందస్తు బెయిల్ కోసం భారత న్యాయ స్థానాలను ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. నిందితుల్లో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రభాకర్ రావు పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు సమయం కోరాలని ప్రభుత్వం కోరడంతో  కోర్టు విచారణను వాయిదా వేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 గా ఉన్న ప్రభాకర్ రావు తాను ఎక్కడికి పారిపోలేదని చికిత్స కోసమే అమెరికా వెళ్లినట్లుగా పిటిషన్ లో పేర్కొన్నాడు. క్యాన్సర్ తో పాటు కోవిడ్ సంబంధిత శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నానని చెప్పారు. తాను కేసు నమోదుకు ముందే అమెరికాకు చికిత్స కోసం వచ్చానని, ఈ విషయమై కింది కోర్టులో మోమో కూడా దాఖలు చేశానని వివరించారు. తాను అమెరికా వెళ్లాక తన ఇంట్లో పోలీసులు సోదాలు చేసినా ఎలాంటి ఆధారాలు దొరకలేదని..ఇప్పటికే ఈ కేసులో చార్జ్ షీట్ కూడా దాఖలు చేసినందునా తన నుంచి తెలుసుకోవాల్సిన కొత్త వివరాలు కూడా ఏమి లేవన్నారు. దర్యాప్తు కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, తాను 65ఏళ్ల సీనియర్ సిటిజన్ అని, తన ఆరోగ్య, వైద్య పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని..తాను పారిపోయినట్లు దర్యాప్తు సంస్థ కోర్టుకు చెప్పి నాన్ బెయిల్ వారెంట్ పొందిందని తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఎస్ ఐబీ చీఫ్ గా చట్టాలకు లోబడి పనిచేశానని కోర్టుకు నివేదించారు.

సుప్రీంకోర్టులో శ్రవణ్ పిటిషన్ విచారణ 28కి వాయిదా

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నఓ టీవీ చానల్ అధినేత శ్రవణ్ కుమార్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సోమవారం శ్రవణ్ కుమార్ బెయిల్ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు శ్రవణ్ పై కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. పోలీస్ విచారణకు సహకరించాలని శ్రవణ్ ను ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 28 కి వాయిదా వేసింది.

వారిద్దరికి రెడ్ కార్నర్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఐఎస్‌బీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్‌రావును విదేశాల నుంచి రప్పించేందుకు ఇటీవలే తెలంగాణ పోలీసులు కీలక పురోగతి సాధించారు. అమెరికాలో తలదాచుకున్న వారిద్దరిపై రెడ్‌కార్నర్ నోటీస్ జారీ అయింది. ఈ మేరకు ఇంటర్‌పోల్ నుంచి సీబీఐ ద్వారా రాష్ట్ర సీఐడీకి సమాచారం అందింది. వారిద్దరిని వీలైనంత త్వరగా తీసుకురావడంపై కేంద్రంతో పోలీసులు సంప్రదింపులు ముమ్మరం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ లు ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది.

ఓవైపు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా కరీంనగర్ బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడే పోలీసులను రిటైరైనా.. విదేశాల్లో ఉన్న వదిలిపెట్టబోనని..తాను కేసీఆర్ అంత మంచివాడిని కాదని హెచ్చరించారు. సరిగ్గా ఇదే తరహాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉండగా..ప్రభాకర్ రావుపై ఇదే రకమైన హెచ్చరికలు చేశారు. కాని ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024మార్చి 10న కేసు నమోదైనప్పటికి నేటీకి కేసులో ప్రభాకర్ రావును పట్టుకోలేకపోవడం గమనార్హం.