FOXO Case | బాలిక గర్భవతి కేసులో నలుగురిపై ఫోక్సో కేసు
FOXO Case విధాత: ఒక బాలుడు అత్యాచారం చేసింది చూసి మరో ముగ్గురు బాలురు అదే బాలికపై అత్యాచారం చేయగా, బాలిక గర్భం దాల్చిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో చోటుచేసుకుంది. ఇంటర్ చదువును మధ్యలోనే ఆపేసిన మైనర్ బాలిక ఇంటివద్దనే ఉంటుంది. ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం పొరుగున ఉండే ఓ బాలుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలిక ఇంట్లో ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇది గమనించిన అదే గ్రామానికి […]

FOXO Case
విధాత: ఒక బాలుడు అత్యాచారం చేసింది చూసి మరో ముగ్గురు బాలురు అదే బాలికపై అత్యాచారం చేయగా, బాలిక గర్భం దాల్చిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో చోటుచేసుకుంది. ఇంటర్ చదువును మధ్యలోనే ఆపేసిన మైనర్ బాలిక ఇంటివద్దనే ఉంటుంది. ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం పొరుగున ఉండే ఓ బాలుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలిక ఇంట్లో ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేశాడు.
ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు బాలురు ఈ విషయం బయటకు చెబుతామని ఆ బాలికను బెదిరించి ఒకరు తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. తనపై జరిగిన దారుణాన్ని ఆ బాలిక భయపడి కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టింది. తల్లిదండ్రులు బాలిక శరీరంలో వస్తున్న మార్పులను గమనించి ఆమెను మందలించి అసలు విషయం తెలుసుకున్నారు.
జరిగిన దారుణంపై చింతకాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ బాలిక వయసు 17ఏళ్లుకాగా, ఏడు నెలల గర్భిణి. విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులపై ఫోక్సో కేసు నమోదు చేశారు.