Kishan Reddy | బయ్యారంపై కేసీఆర్ ఇచ్చిన.. ఉక్కు పరిశ్రమ హామీ ఏమైంది? : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

Kishan Reddy కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు త్వరలో కోచ్ ఫ్యాక్టరీ కూడా తెస్తాం రాష్ట్ర అభివృద్ధికి పలు కేంద్ర ప్రాజెక్టులు కేంద్రంపై బురదజల్లుతున్న రాష్ట్రం ఏ రాష్ట్రమైనా కేంద్రానికి వివక్ష ఉండదు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకున్నా, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదేళ్లయినా ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని కేంద్ర పర్యాటక శాఖ […]

  • By: Somu    latest    Jul 02, 2023 10:28 AM IST
Kishan Reddy | బయ్యారంపై కేసీఆర్ ఇచ్చిన.. ఉక్కు పరిశ్రమ హామీ ఏమైంది? : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

Kishan Reddy

  • కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు
  • త్వరలో కోచ్ ఫ్యాక్టరీ కూడా తెస్తాం
  • రాష్ట్ర అభివృద్ధికి పలు కేంద్ర ప్రాజెక్టులు
  • కేంద్రంపై బురదజల్లుతున్న రాష్ట్రం
  • రాష్ట్రమైనా కేంద్రానికి వివక్ష ఉండదు
  • కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకున్నా, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదేళ్లయినా ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈనెల 8న ప్రధాని మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో ఆదివారం ఆయన బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్,ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విభజన హామీలలో ఒకటిగాఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కేంద్రం పట్టించుకోలేదనే మీడియా ప్రశ్నకు కిషన్ రెడ్డి ప్రతిస్పందిస్తూ కేసీఆర్ ను ఉల్టా ప్రశ్నించారు.

ఎన్నికల్లో కేసీఆర్ఎమైందీ

2018 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఆయన కుటుంబం కేంద్రం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వకుంటే బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తుందని ప్రకటించారన మంత్రి గుర్తు చేశారు. ఇచ్చిన మాట మీద కేసీఆర్, ఆయన కుటుంబానికి చిత్తశుద్ధి ఉంటే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

హామీ అమలు చేయకుంటే మెడమీద తలకాయ నరుక్కుంటానని కేసీఆర్ చెప్పాడని, మరి ఇప్పుడు తలకాయ ఎన్ని సార్లు నరుక్కుంటాడంటూ ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం ఇచ్చిన హామీకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ ఏర్పాటు సందర్భంగా కోళ్లు, గొర్రెలు కోసుకొని దావత్ చేసుకుందాం అన్నారని గొర్రెలేమో ముసలివై పోతున్నాయని మంత్రి చమత్కరించారు.

కోచ్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు

రాష్ట్ర విభజన హామీలలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీని నిర్లక్ష్యం చేస్తున్నారని మీడియా అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా కాజీపేటలో పిఓహెచ్ తోపాటు వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణానికి,నేషనల్ హైవే నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ చేస్తారని మంత్రి ప్రకటించారు. త్వరలో కోచ్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేస్తామంటూ ఈ సందర్భంలో మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం గమనార్హం.

కాజీపేటలో ముందుగా పిఓహెచ్ మంజూరైన విషయం తెలిసిందేనని అయితే, ఇక్కడ వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మించాలని కేంద్రం భావిస్తుందని చెప్పారు. ఈనెల 8వ తేదీ లోపు దీనికి మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ దాదాపు సమానమని అంటూ సమర్ధించుకున్నారు. 200 వరకు వ్యాగన్లు తయారు చేస్తారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వసతులు, భూమి సరిపోతుందని అయితే ఇంకా ఒకటిన్నర రెండు ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉందని, ఈనెల 8వ తేదీలోపు ఆ పని కూడా పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పినట్లు మంత్రి తెలిపారు.

రాష్ట్రానికి అనేక కేంద్ర ప్రాజెక్టులు

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు అమలు చేస్తుందని మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టును నిర్మించాలని కేంద్రం భావిస్తుందని ప్రకటించారు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ లో భాగంగా ఘట్కేసర్ నుండి యాదాద్రి వరకు లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలో జాప్యం చేస్తున్నందున కేంద్రమే రూ. 1200 కోట్ల నిధులు భరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రామప్ప అభివృద్ధికి, గిరిజన సర్క్యూ ట్ ప్రాజెక్టు అమలుకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఈ ఏడాది చివరి వరకు వేయి స్తంభాల దేవాలయంలో కళ్యాణమండపం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మేడారానికి ప్రతి ఏటా నిధులు కేటాయిస్తున్నామని, అన్ని పండుగలు గొప్పవే అని జాతీయ పండుగ అంటూ ప్రకటించడం ఉండదని కిషన్ రెడ్డి వివరించారు.

వరంగల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మోడీ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను జయప్రదం చేయాలని మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ రాజేందర్లు కోరారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు ప్రేమేందర్ రెడ్డి, ధర్మారావు, రావు పద్మ, కొండేటి శ్రీధర్, రాకేష్ రెడ్డి, కుసుమ సతీష్,ప్రదీప్‌రావు తదితరులు పాల్గొన్నారు.