Kodanda Reddy | 111 జీవో పరిధిలో TRS నేతల ఫామ్ హౌజ్‌లు: మాజీ MLA కోదండరెడ్డి

Kodanda Reddy తక్కువ ధరకు కాజేసిన బడాబాబులు పేద రైతులకు అండగా Congress ఆలిండియా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మాజీ MLA కోదండరెడ్డి విధాత: జంట జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ నాయకులు, ఫామ్ హౌజ్‌లు నిర్మించుకున్నారని ఆలిండియా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ 111 జీవో పరిధిలో ఉన్న పేద సన్నకారు రైతులకు […]

Kodanda Reddy | 111 జీవో పరిధిలో TRS నేతల ఫామ్ హౌజ్‌లు: మాజీ MLA కోదండరెడ్డి

Kodanda Reddy

  • తక్కువ ధరకు కాజేసిన బడాబాబులు
  • పేద రైతులకు అండగా Congress
  • ఆలిండియా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మాజీ MLA కోదండరెడ్డి

విధాత: జంట జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ నాయకులు, ఫామ్ హౌజ్‌లు నిర్మించుకున్నారని ఆలిండియా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ 111 జీవో పరిధిలో ఉన్న పేద సన్నకారు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

ఈ జీవో పరిధిలో ఉన్న 80 శాతం భూములను ఇప్పటికే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులు అనధికారికంగా తక్కువ ధరకు సొంతం చేసుకున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు మేలు చేయకుండా పేద రైతులు తమ భూములను తెగనమ్ముకునే వరకు ఈజీవోను అడ్డం పెట్టుకుని ధనవంతులకు, రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా నిలిచిందని ఆరోపించారు. ప్రభుత్వం పగడ్బందీ ప్రణాళికతో 111 జీవోను సంపూర్ణంగా ఎత్తివేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపపట్టినప్పటి నుండి భూములపైనే దృష్టి పెట్టిందన్నారు.

భూదాన బోర్డును రద్దు చేసిన కేసీఆర్ సర్కారు 1 లక్ష 45 వేల ఎకరాల భూమిని చట్ట విరుద్దంగా పారిశ్రామిక వేత్తలకు అమ్ముతుందని కోదండరెడ్డి ఆరోపించారు. దళితులకు చెందిన అసైన్డ్ భూములు వేలం వేసి అమ్ముతుందన్నారు. ధరణి పోర్టల్ ను ఆసరా చేసుకుని లక్షల ఎకరాల పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టి టిఆర్ఎస్ నాయకులు సొంతం చేసుకుంటున్నారన్నారు.

తాపీగా ఈ ప్రభుత్వం 111 జీవోను ఎత్తి వేసి ఒక పెద్ద భూ కుంభ కోణానికి తలపడిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ భూ సంస్కరణలు తెచ్చి, భూ స్వాములు, జాగీరుదారులు, జమీందారులు, వ్యవస్థను రద్దు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత నయా భూ స్వాములను తెర పైకి తెచ్చిందన్నారు.