Komatireddy Rajgopal
విధాత: మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత వైఖరి జనం చెవుల్లో పూలు పెట్టెదిగా ఉందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ట్వీట్టర్ వేదిగా ఆయన కవిత తీరును తప్పుబట్టారు.
తెలంగాణ ప్రకటించినప్పుడు కేసీఆర్ పార్లమెంటులో లేడని, మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తున్నప్పుడు కూడా కవిత ఎంపీ కాదని, అయినా ఆ ఘనత మీదే అన్నట్లుగా చెప్పుకోవాలనుకోవడం హాస్యాస్పదమన్నారు.
తెలంగాణ ప్రకటించినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ లో లేడు, మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తున్నప్పుడు కవిత ఎంపీ కాదు, అయినా ఆ ఘనత మీదే అన్నట్లు చెప్పుకోవాలని చూడటం హాస్యాస్పదం. కవిత ఓడిపోయింది కాబట్టి సరిపోయింది కానీ, లేదంటే తానే తెచ్చినట్టు డప్పు కొట్టుకుని జనం చెవుల్లో పూలు పెట్టేది
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) September 19, 2023
కవిత ఎంపీగా ఓడిపోయింది కాబట్టి సరిపోయిందని లేదంటే తానే మహిళా బిల్లు తెచ్చినట్లుగా జనం చెవుల్లో పూలు పెట్టేదన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మహిళల అభ్యున్నతి కోసం మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చారని, దీన్ని కూడా బీఆరెస్ పార్టీ తమ ఘనతలాగే చెప్పుకోవడం విడ్డూరమన్నారు