Komatireddy Venkatreddy : చంపుతామంటున్నారు.. బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు

విధాత: తనను చంపుతామంటూ కొందరు బెదిరిస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో (Banjara Hills Police Station) ఫిర్యాదు చేశారు. తనను చంపుతామంటూ బెదిరిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారని వెంకట్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల నల్గొండ (Nalgonda) జిల్లాకు చెందిన సొంత పార్టీ నేత, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు […]

  • By: Somu |    latest |    Published on : Mar 11, 2023 5:24 AM IST
Komatireddy Venkatreddy : చంపుతామంటున్నారు.. బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు

విధాత: తనను చంపుతామంటూ కొందరు బెదిరిస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో (Banjara Hills Police Station) ఫిర్యాదు చేశారు. తనను చంపుతామంటూ బెదిరిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారని వెంకట్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇటీవల నల్గొండ (Nalgonda) జిల్లాకు చెందిన సొంత పార్టీ నేత, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) ను, ఆయన కొడుకు డాక్టర్ సుహాస్(Cheruku Suhas)ను తన మనుషులు చంపుతారని ఫోన్‌లో వెంకట్ రెడ్డి బెదిరించిన నేపథ్యంలో వారికి, వెంకటరెడ్డికి మధ్య వివాదం నెలకొంది.

ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి పై చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్ పోలీసులకు, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తనపై చెరుకు సుధాకర్ పెట్టిన కేసును కోర్టులోనే తేల్చుకుంటాను అన్న కోమటిరెడ్డి, అనూహ్యంగా తనను కొందరు చంపుతామని బెదిరిస్తున్నారంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం మరో మలుపు తిరిగినట్లయింది.