KTR | కాంగ్రెస్ ఇచ్చిన కరెంటా..కేసీఆర్ ఇచ్చిన కరెంటా..

KTR ఏది కావాలో అడుగాదాం.. అదే సింగిల్ పాయింట్ ఎజెండాగా ఎన్నికలకు వెలుదాం తెలంగాణలో నడస్తున్నది చంద్రబాబు కాంగ్రెస్ విధాత: కాంగ్రెస్ గతంలో ఇచ్చిన కరెంటు కావాలా… KCR ఇచ్చిన కరెంటు కావాలా అన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ఎన్నికలకు వెలుదామని మంత్రి KTR కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. జగిత్యాలలో MLC ఎల్‌. రమణ తండ్రి ఎల్‌. గంగారాం ఇటీవల అనారోగ్యంతో మరణించగా, ఆయన కుటుంబాన్ని KTR పరామర్శించారు. ఈ సందర్భంగా KTR స్థానిక విలేఖరులతో […]

  • Publish Date - July 16, 2023 / 11:26 AM IST

KTR

  • ఏది కావాలో అడుగాదాం.. అదే సింగిల్ పాయింట్ ఎజెండాగా ఎన్నికలకు వెలుదాం
  • తెలంగాణలో నడస్తున్నది చంద్రబాబు కాంగ్రెస్

విధాత: కాంగ్రెస్ గతంలో ఇచ్చిన కరెంటు కావాలా… KCR ఇచ్చిన కరెంటు కావాలా అన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ఎన్నికలకు వెలుదామని మంత్రి KTR కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. జగిత్యాలలో MLC ఎల్‌. రమణ తండ్రి ఎల్‌. గంగారాం ఇటీవల అనారోగ్యంతో మరణించగా, ఆయన కుటుంబాన్ని KTR పరామర్శించారు. ఈ సందర్భంగా KTR స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ రైతుల సమస్యపై రైతులనే అడుగుదామన్నారు. మళ్లీ కాంగ్రెస్ కరెంటు రోజులు కావాలా.. లేక ఊర్లలో ఎవరైన చనిపోతే స్నానాలకు కూడా కరెంటు అడుక్కునే రోజులు కావాలా…కడుపు నిండా కరెంటు ఇచ్చిన రోజులు కావాలా అడుగుదామన్నారు.

రైతు బంధు పొందుతున్న 75లక్షల రైతు కుటుంబాలను 2004 నుండి 2014వరకు ఉన్న కరెంటు కావాలా వద్దా తీర్పునివ్వమని అడుగుదామన్నారు. ఊర్లలో ఎవరన్న చనిపోతే స్నానాల కోసం అధికారులను కరెంటు అడుక్కునే వారమని, రైతులు చద్దర్లు తీసుకుని బావుల కాడనే పడుకుని కరెంటు కోసం ఎదురుచూసే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉండేదన్నారు.

సబ్ స్టేషన్‌లలో రైతులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, సిబ్బందిని నిర్భంధించిన కాంగ్రెస్ పాలన రోజులు మరిచిపోవద్దని, అందుకే సబ్ స్టేషన్‌ల వద్ద రైతులను పోయి ఇంకేమి అడుగుతామన్నారు. ఇక లాగ్ బుక్‌లదేముందని.. తిమ్మిని బమ్మిని చేయడంలో MLAలను కొనడంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ సిద్ధహస్తుడని, RSS నుంచి వచ్చి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడని, గాంధీ భవన్‌ను గాడ్సె నడుపుతుంటే సబ్ స్టేషన్‌ లాగ్ బుక్కుల‌దేముంద‌న్నారు.

రేవంత్ రెడ్డి RSS కార్యకర్త ఏజెంట్ అని, అందుకే నరేంద్ర మోడీ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే ఒక్కసారి కూడా ప్రశ్నిచడం లేదన్నారు. ఇప్పటికి RSS వాళ్లు కనబడితే రేవంత్ వారి కాళ్లకు మొక్కుతా అంటాడని KTR చురకలేశారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత కరెంట్ తెచ్చిన మాట వాస్తవమని, కానీ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఆ ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు చంద్రబాబు కాంగ్రెస్ అన్నారు. రాజశేఖర్ రెడ్డి విధానాలు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో లేవన్నారు.

ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఆంధ్రాకి తీసుకుపోయారన్నారు. అక్కడ YSR కాంగ్రెస్ పార్టీగా నడుస్తుందన్నారు. రాహుల్ గాంధీకి వడ్లు తెల్వదు ఎడ్లు తెల్వదు.. ఆయనకు క్లబ్బులు, పబ్బులు మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. ఆయన లీడర్ కాదు రీడర్ అని, 80 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అనే రాహుల్ గాంధీని దేశమంతా ఏం అంటుందో అందరికీ తెలుసు అంటు పరోక్షంగా పప్పు కామెంట్స్‌ను గుర్తు చేశారు.