Bihar | బీహార్‌లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. మ‌హిళా ఉద్యోగినిపై దాడి

విధాత‌: బీహార్‌ (Bihar)లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్ర‌మ తవ్వ‌కాల‌ను అడ్డుకున్న ఓ మ‌హిళా ఉద్యోగినిపై కొంద‌రు దుండ‌గులు దాడికి పాల్ప‌డ్డారు. ప్రాణ‌భ‌యంతో పారిపోతున్న ఆమెను వెంబ‌డించి రాళ్ల‌తో కొట్టారు. నేల‌పై ఈడ్చుకెళ్లి హింసించారు. అంత‌టితో ఆగ‌కుండా ఆమెను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించారు. ఈ ఘ‌ట‌న బీహార్ రాజ‌ధాని పాట్నాలోని బిహ్త్ ప‌ట్ట‌ణంలో మంగ‌ళ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దాడికి పాల్ప‌డ్డ దుండ‌గుల‌ను […]

  • By: Somu    latest    Apr 18, 2023 11:22 AM IST
Bihar | బీహార్‌లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. మ‌హిళా ఉద్యోగినిపై దాడి

విధాత‌: బీహార్‌ (Bihar)లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్ర‌మ తవ్వ‌కాల‌ను అడ్డుకున్న ఓ మ‌హిళా ఉద్యోగినిపై కొంద‌రు దుండ‌గులు దాడికి పాల్ప‌డ్డారు. ప్రాణ‌భ‌యంతో పారిపోతున్న ఆమెను వెంబ‌డించి రాళ్ల‌తో కొట్టారు. నేల‌పై ఈడ్చుకెళ్లి హింసించారు. అంత‌టితో ఆగ‌కుండా ఆమెను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించారు. ఈ ఘ‌ట‌న బీహార్ రాజ‌ధాని పాట్నాలోని బిహ్త్ ప‌ట్ట‌ణంలో మంగ‌ళ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది.

బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దాడికి పాల్ప‌డ్డ దుండ‌గుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3 ఎఫ్ఐఆర్‌ల‌ను న‌మోదు చేసి 44 మంది నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగ‌తా వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అయితే బిహ్త్ ప‌ట్ట‌ణంలో గ‌త కొన్ని రోజుల నుంచి ఇసుక అక్ర‌మ దందా కొన‌సాగుతోంది. స్థానికులు ఇచ్చిన స‌మాచారంతో అధికారులు అక్క‌డికి చేరుకుని ఇసుక అక్ర‌మ దందాను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఇసుక మాఫియా మహిళా అధికారిణిపై దాడికి దిగింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.